Friday, September 12, 2025 09:04 PM
Friday, September 12, 2025 09:04 PM
roots

ఒంటిపూట బడులపై ఏపీ సర్కార్ క్లారిటీ..!

ఎండల తీవ్రవ రోజు రోజుకు పెరుగుతోంది. ఫిబ్రవరి నెలాఖరులోనే ఏపీలో పలు చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి. దీంతో పలు చోట్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రధసప్తమి నాటి నుంచి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఒంటి పూట బడులపై ఇప్పటికే ప్రభుత్వానికి పలు రకాలుగా విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి ప్రతి ఏటా మార్చి 12వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయి. అయితే ఈ ఏడాది ఎండ వేడిమి అధికంగా ఉండటంతో ముందుగానే ఒంటిపూట బడులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా ఈ విషయంపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read : మార్చొద్దు.. ఏపీ బిజేపి చీఫ్ పై చంద్రబాబు ఒపినియన్…!

ప్రతి ఏటా మార్చి 12వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయి. అయితే ఈ ఏడాది మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. మార్చి 10న సోమవారం వచ్చింది. ఇలాగే మార్చి 17వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. దీంతో ఒంటి పూట బడులు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే చర్చ ప్రస్తుతం జోరుగా నడుస్తోంది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉదయం 11 గంటల నుంచే ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. భానుడి ప్రతాపానికి వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మార్చి మొదటి వారం నుంచే ఎండ వేడిమి భారీగా పెరుగుతుందని కూడా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రభుత్వం కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

Also Read : వారసుడి కోసం రంగంలోకి తోడల్లుడు..!

ఈ ఏడాది మార్చి 17వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇవి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. పరీక్షలు జరుగుతున్న సమయంలో సెంటర్‌గా కేటాయించిన పాఠశాలల్లో మధ్యాహ్నం నిర్వహించాల్సి ఉంది. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు పెట్టాలని భావించినప్పటికీ శనివారం రావడంతో.. ముందుగానే ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్చి 10న సోమవారం రావడంతో ఆ రోజు నుంచే ఒంటిపూట బడులు ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 30 వరకు టెన్త్ క్లాస్ పరీక్షలున్నాయి. ఆ తర్వాత నుంచే హైస్కూల్ పరీక్షలు నిర్వహించేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మార్చి పదవ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై మరో రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్