పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న సరే ద్విచక్ర వాహనాలను నడిపే వారిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇటీవల కర్నూలు సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత పోలీసుల తీరుపై కూడా విమర్శలు వచ్చాయి. ఈ ఘటనకు కారణం శివశంకర్ అనే యువకుడు మద్యం సేవించి రోడ్డుపైకి రావటమే అనేది స్పష్టంగా అర్థమైంది. ఆరోజు సాయంత్రం మద్యం సేవించిన అనంతరం స్నేహితుడిని మరో ప్రాంతంలో దింపేందుకు శివశంకర్ వెళ్లడం, ఆ క్రమంలో రోడ్డు ప్రమాదం జరగటం, రోడ్డుపై పడి ఉన్న బండిని బస్సు ఢీకొని మంటలు చెలరేగటం తెలిసిందే.
Also Read : కొత్త జిల్లాలు.. మారనున్న సరిహద్దులు..!
ఇక ఇప్పుడు వాహనదారుల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల విషయంలో కఠిన నిర్ణయాలు దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా గుంటూరు కలెక్టర్ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. జాతీయ రహదారులపై డ్రైవింగ్ చేస్తున్న మైనర్లు, లైసెన్సులు లేనివారు, మద్యం సేవించి వాహనాలు నడిపేవారు, సరైన పత్రాలు లేకుండా వాహనాలు వాడుతున్న వారి విషయంలో గుంటూరు జిల్లా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అలాగే గంజాయి సహ మత్తు పదార్థాలను సేవించే వారి విషయంలో కూడా కఠిన చర్యలకు దిగుతున్నారు పోలీసులు.
Also Read : తెలంగాణలో బొగ్గు బయటపెట్టింది రామ భక్తుడా..? పొయ్యితో బయటపడ్డ బొగ్గు నిల్వలు..!
తాజాగా ఆయన సమాచారం ప్రకారం పెద్ద ఎత్తున వాహనాలను సీజ్ చేశారు గుంటూరు పోలీసులు. ఎస్పీ ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన పోలీసులు.. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన మొత్తం 732 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. అలాగే వాహనాలు నడిపే వారితో పాటుగా వాటి యజమానులపై కూడా కేసులు పెట్టారు. ఇక మైనర్లు డ్రైవింగ్ చేస్తూ దొరికితే తల్లిదండ్రులను పిలిచి వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. ఇక నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలను కూడా పెద్ద ఎత్తున సీజ్ చేశారు. మైనర్లు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ దొరికితే తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాల్సిందే అని హెచ్చరిస్తున్నారు పోలీసులు.




