Friday, September 12, 2025 06:23 AM
Friday, September 12, 2025 06:23 AM
roots

తగ్గిన జీఎస్టీ.. ఏయే ధరలు తగ్గుతాయంటే..!

విమర్శలకు వేదికగా మారిన జీఎస్టీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సామాన్యులకు అందుబాటులోకి వచ్చే విధంగా జీఎస్టీలో మార్పులు చేసింది. 2017లో మొదలైన జీఎస్టీలో నేటి నుంచి పలు మార్పులు తీసుకొచ్చింది. గృహోపకరణాలు, మందులు, చిన్న కార్లు, ఉపకరణాలపై సుంకాలను తగ్గించింది. దీని ప్రభావం టూత్‌పేస్ట్, భీమా, ట్రాక్టర్లు, సిమెంట్ వంటి వరకు ప్రతీ దానిపై పడనుంది. ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు, భారతీయ వస్తువులకు డిమాండ్ పెంచేందుకు ఈ నిర్ణయాలు తీసుకుంది.

Also Read : ఏపీ స్థానిక సమరానికి ఎలక్షన్ కమీషన్ సిద్దం..!

జీఎస్టీ కౌన్సిల్ శ్లాబ్‌లను 5 శాతం, 18 శాతానికి పరిమితం చేస్తూ రేటు సవరణను ఆమోదించింది. కౌన్సిల్ ప్రస్తుత నాలుగు శ్లాబులను అంటే 5, 12, 18, 28 లను కేవలం రెండుకు తగ్గించింది. అయితే, హై-ఎండ్ కార్లు, పొగాకు, సిగరెట్లు వంటి కొన్ని ఎంపిక చేసిన వస్తువులకు ప్రత్యేక 40 శాతం శ్లాబును ప్రతిపాదించారు. పాన్ మసాలా, గుట్కా, సిగరెట్లు, జర్దా వంటి నమిలే పొగాకు ఉత్పత్తులు, తయారు చేయని పొగాకు, బీడీ మినహా అన్ని ఉత్పత్తులకు కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వస్తాయి.

Also Read : అసలు వస్తారా.. రారా.. ఏమైంది మీకు..?

టూత్ పౌడర్, ఫీడింగ్ బాటిళ్లు, టేబుల్‌ వేర్, కిచెన్‌ వేర్, గొడుగులు, పాత్రలు, సైకిళ్లు, వెదురు ఫర్నిచర్ మరియు దువ్వెనలు వంటి వస్తువులపై 12 శాతం నుండి 5 శాతానికి తగ్గింపు ఉంటుంది. షాంపూ, టాల్కమ్ పౌడర్, టూత్‌పేస్ట్, టూత్ బ్రష్‌ లు, ఫేస్ పౌడర్, సబ్బు మరియు హెయిర్ ఆయిల్‌ పై 18 శాతం నుండి 5 శాతానికి తగ్గిస్తారు. ఎయిర్ కండిషనర్లు, డిష్ వాషర్లు, టీవీలు వంటి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్‌పై ప్రస్తుత 28 శాతం నుంచి 18 శాతం పన్ను విధించనున్నారు. ప్రాణాలను రక్షించే మందులు, ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులు మరియు కొన్ని వైద్య పరికరాలపై రేటు 12 శాతం / 18 శాతం నుండి 5 శాతం లేదా సున్నాకి తగ్గింది.

Also Read : అసలు విషయం మర్చిపోయారా సార్..!

హోటల్ రూమ్స్ ధరలు కూడా తగ్గుతాయి. ఐటీసీతో 12 శాతంగా ఉన్న జీఎస్టీని ఐటీసీ లేకుండా 5 శాతానికి తగ్గించారు. రూ.7,500 వరకు ఉన్న గదులపై పన్నును 5 శాతానికి తగ్గించారు. ఎకానమీ క్లాస్ టిక్కెట్లపై కేవలం 5 శాతం జీఎస్టీ మాత్రమే. 1,200 సిసి కంటే తక్కువ, 4,000 మిమీ కంటే ఎక్కువ పొడవు లేని పెట్రోల్, ఎల్‌పిజి, సిఎన్‌జి వాహనాలు, 1,500 సిసి వరకు మరియు 4,000 మిమీ వరకు పొడవు గల డీజిల్ వాహనాలు కూడా 28 శాతం నుండి 18 శాతానికి మారుతాయి. పన్ను రేటు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గడంతో సిమెంట్ ధర తగ్గుతుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్