Tuesday, October 28, 2025 03:58 AM
Tuesday, October 28, 2025 03:58 AM
roots

సాయి రెడ్డి పదవి ఫైనల్ అయిపోయినట్టే..?

ఏది ఏమైనా రాజకీయాల్లో విజయసాయిరెడ్డిది విలక్షణ పాత్ర. ఆయన ఏం చేసినా సరే సంచలనంగానే ఉంటుంది. రాజకీయాలనుంచి దూరంగా ఉన్నానని ఇటీవల ప్రకటించి.. రాజ్యసభకు కూడా రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి, ఇప్పుడు ఏం చేయబోతున్నారనే దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. వ్యవసాయం చేసుకుంటానని ఆ తర్వాత కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు విజయ సాయి రెడ్డి. అయితే ఇప్పుడు మాత్రం ఆయన కేంద్ర ప్రభుత్వ పెద్దలకు దగ్గరగానే ఉంటున్నట్లు క్లారిటీ వస్తోంది.

Also Read :ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ కవర్ డ్రైవ్..!

తమిళనాడు గవర్నర్ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. దీనితో ఆ స్థానానికి విజయసాయిరెడ్డిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసే అవకాశం ఉండవచ్చు అనే ప్రచారం జరుగుతోంది. రాజ్ భవన్ లోకి అడుగుపెట్టేందుకు విజయ సాయి రెడ్డి గట్టిగానే ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. మూడు సంవత్సరాలకు పైగా పదవీకాలం ఉన్నా సరే తన రాజ్యసభ స్థానానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం వెనుక కారణం.. గవర్నర్ పదవి అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.

Also Read : పాపం.. వైసీపీకి మరో షాక్ ట్రీట్‌మెంట్..!

ఇటీవల ఉపరాష్ట్రపతి అధికారిక కార్యక్రమంలో విజయసాయిరెడ్డి తళుక్కున మెరిసారు. రాజకీయాల నుంచి దూరంగా ఉంటానని చెప్పిన ఆయన.. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు మాత్రం దూరంగా లేరు అని తెలుస్తోంది. ప్రస్తుతం తనకున్న రాజ్యసభ పదవి కారణంగా ఎటువంటి ఉపయోగం లేకపోవడంతో విజయసాయిరెడ్డి వదులుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఉండటంతోనే ఆ పదవిని వదులుకున్న ఆయన గవర్నర్ అయ్యేందుకు బ్యాక్ గ్రౌండ్ లో గట్టిగానే వర్క్ చేశారట. ఎవరిని ఏ విధంగా దారిలోకి తెచ్చుకోవాలో పక్కా క్లారిటీ ఉండే విజయసాయిరెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దగ్గరగానే ఉంటారు. అందుకే వైయస్ జగన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటుంది. మరి తన రాజకీయ భవిష్యత్తును విజయసాయిరెడ్డి ఏ రూపంలో వెతుక్కుంటారో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్