ఐపిఎల్ లో ఆదివారం సాయంత్రం గుజరాత్ – ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ సంచలనమే. 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా విజయం సాధించడం ఆశ్చర్యం కలిగించింది. గుజరాత్ ఓపెనర్లు శుభమన్ గిల్, సాయి సుదర్శన్ ఇద్దరూ దూకుడుగా ఆడుతూ ఢిల్లీకి ఏ దశలో కూడా అవకాశం ఇవ్వలేదు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ జట్టు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. ఆ తర్వాత కెఎల్ రాహుల్ దూకుడుతో ఢిల్లీ స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది.
Also Read : సాయి రెడ్డి బంధువులే కీ రోల్.. లిక్కర్ స్కాంలో మరో సెన్సేషన్
ఆరంభంలో ఢిల్లీ కాస్త తడబడినా ఆ తర్వాత మాత్రం దూకుడుగా ఆడింది. ఇక ఈ మ్యాచ్ లో గిల్ – సాయి సుదర్శన్ జోడీ దూకుడు ఆశ్చర్యపరిచింది. ఈ సీజన్ లో ఈ ఇద్దరూ 12 ఇన్నింగ్స్‌ల్లో 839 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పి విజయవంతమైన జోడీగా నిలిచారు. ఇతర జట్ల పార్టనర్ షిప్ లు కనీసం వీళ్ళ దరిదాపుల్లో కూడా లేవు. ఇక వ్యక్తిగత స్కోర్ లతో కూడా వీళ్ళు ఇద్దరూ టాప్ లోనే నిలిచారు. గిల్ ఈ సీజన్ లో ఇప్పటికే 12 మ్యాచ్‌ల్లో 6 అర్ధ సెంచరీలతో సహా 601 పరుగులు చేసాడు.
Also Read : క్రికెట్ ఫ్యాన్స్ కు మరో షాకింగ్ న్యూస్.. మరో ప్లేయర్ రిటైర్..?
సాయి సుదర్శన్ విషయానికి వస్తే.. సుదర్శన్ ఈ సీజన్‌లో ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలతో సహా 617 పరుగులతో టాప్ లో ఉన్నాడు. 30 ఇన్నింగ్స్‌లలో, సుదర్శన్, గిల్ 1985 పరుగులు చేసారు. వీళ్ళకంటే ముందు ఏబీ డివిలియర్స్–విరాట్ కోహ్లీ – 76 ఇన్నింగ్స్‌లలో, 3123 పరుగులు చేసారు. క్రిస్ గేల్–విరాట్ కోహ్లీ – 59 ఇన్నింగ్స్‌లలో 2787 పరుగులు చేసారు. శిఖర్ ధావన్–డేవిడ్ వార్నర్ – 50 ఇన్నింగ్స్‌లలో 2357 పరుగులు చేసారు. ఫాఫ్ డు ప్లెసిస్–విరాట్ కోహ్లీ – 41 ఇన్నింగ్స్‌లలో, 2032 పరుగులు చేసారు. యావరేజ్ పరంగా చూస్తే గిల్ – సాయి సుదర్శన్ జోడీదే ఎక్కువ. 68 సగటుతో వీళ్ళు ముందు ఉన్నారు.