Friday, September 12, 2025 08:51 PM
Friday, September 12, 2025 08:51 PM
roots

షమిని ఆడించాలా వద్దా.. భయపడుతున్న గంభీర్

ఆస్ట్రేలియా పర్యటనకు టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని ఎంపిక చేయాలా వద్దా అనే దానిపై ఇప్పుడు భారత జట్టు యాజమాన్యం మల్లగుల్లాలు పడుతోంది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న షమీ.. దేశవాళి క్రికెట్ లో దుమ్ము రేపుతున్నాడు. 34 ఏళ్ల షమీ ఇప్పుడు జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్తాడా లేదా అనే దానిపై రెండు వారాల నుంచి ఉత్కంట నెలకొంది. అయితే అతని ప్రదర్శన ఫిట్నెస్ తో ఇప్పుడు సెలెక్టర్లకు పెద్ద పరీక్షే పెట్టాడు. మధ్యప్రదేశ్‌తో బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడిన తర్వాత షమీ ఆస్ట్రేలియా వెళ్తాడని వార్తలు వచ్చాయి.

Also Read : మరో ఐపిఎస్ కు మూడింది

ఆ మ్యాచ్ లో షమీ ఏడు వికెట్లతో రాణించాడు. కాని ఆ మ్యాచ్ తో ఆగకుండా… ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం బెంగాల్ జట్టులో పేసర్‌ని ఎంపిక చేశారు. గత 11 రోజుల్లో ఆరు టీ20లు ఆడాడు. 24 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన షమీ… ఐదు వికెట్లు పడగొట్టాడు. షమీ మూడు మ్యాచ్‌ల్లో పొదుపుగా బౌలింగ్ చేస్తూ… తిరిగి ఫాంలోకి వచ్చాడు. బెంగాల్ తమ తదుపరి మ్యాచ్‌ను రాజస్థాన్‌తో గురువారం రాజ్‌కోట్‌లో ఆడుతుంది. షమీని ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎంపిక చేస్తే 13 రోజుల్లో ఇది అతనికి ఏడవ టి20 మ్యాచ్ కానుంది.

షమీ గాయం నుండి పూర్తిగా కోలుకున్నాడని చెప్పడానికి ఇదే నిదర్శనం అంటున్నారు క్రికెట్ పండితులు. మిగిలిన మూడు టెస్టులకు షమీని భారత జట్టులో చేరిస్తే… ఫిట్నెస్ కంటిన్యూ చేస్తాడా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బ్రిస్బేన్, మెల్‌బోర్న్, సిడ్నీలలో మ్యాచ్‌లకు పెద్ద గ్యాప్ లేదు. మొదటి టెస్ట్, రెండో టెస్ట్ కు మాత్రం పది రోజుల గ్యాప్ ఉంది. భారత్, ఆస్ట్రేలియా జట్లు 23 రోజుల్లో మూడు టెస్టులు ఆడనున్నాయి. బ్రిస్బేన్ టెస్టు డిసెంబర్ 14-18 వరకు జరగనుండగా, బాక్సింగ్ డే టెస్ట్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో డిసెంబర్ 26-30 మధ్య జరగనుంది.

Also Read : నోర్ముయ్.. ప్రెస్‌మీట్‌లోనే అజిత్ పవార్‌పై ఏక్‌నాథ్ షిండే ఫైర్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చివరిదైన న్యూ ఇయర్ టెస్ట్ జనవరి 3-7 వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. ఒకవేళ సెలెక్టర్లు షమీని జట్టులోకి ఎంపిక చేస్తే అతను ఎంత వరకు రాణిస్తాడు అనేది కూడా ప్రధాన ప్రశ్న. గత ఏడాది జులైలో చివరిసారి షమీ టెస్ట్ ఆడాడు. ఆ తర్వాత వన్డే ప్రపంచ కప్ లో రాణించాడు. మళ్ళీ జాతీయ జట్టులో ఆడలేదు. ఈ తరుణంలో కోచ్ గంభీర్ రిస్క్ చేస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ ఉన్న నేపధ్యంలో గంభీర్ సాహసం చేయకపోవచ్చనే అభిప్రాయం వినపడుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్