దేశ వ్యాప్తంగా మధ్యతరగతి ప్రజలపై గ్యాస్ బండ పడింది. 50 రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సబ్సిడీ, సబ్సిడీ లేని వినియోగదారులకు ఎల్‌పిజి సిలిండర్ల ధరను రూ.50 పెంచినట్లు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి సోమవారం ప్రకటించారు. ఈ పెంపు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పిఎంయువై) లబ్ధిదారులకు, లబ్ధిదారులు కానివారికి వర్తిస్తుందని తెలిపారు. సవరించిన ధరలు ఏప్రిల్ 8 నుండి అమల్లోకి వస్తాయన్నారు కేంద్ర మంత్రి.
Also Read : ట్రంప్ దెబ్బ ఇలా కూడా..!
PMUY లబ్ధిదారులకు, సిలిండర్ ధర రూ. 500 నుండి రూ. 550 కి పెరుగుతుందన్నారు. ఇతర వినియోగదారులకు ఇది రూ. 803 నుండి రూ. 853 కి పెరుగుతుందని వివరించారు. గత 2 నుంచి 3 వారాల నుంచి సమీక్షిస్తున్నామని, అప్పుడే నిర్ణయం తీసుకున్నామని అన్నారు. పెట్రోల్ మరియు డీజిల్ పై తాజాగా పెంచిన ఎక్సైజ్ సుంకం వినియోగదారులపై భారం పడదు అని క్లారిటీ ఇచ్చారు. కానీ గ్యాస్ ధరల పెంపు పడుతోంది అన్నారు. రూ.43,000 కోట్ల నష్టాన్ని భర్తీ చేస్తామని తెలిపారు.
Also Read : అలా వెళ్ళడానికి ఏమాత్రం సిగ్గుపడను
ఇక పెట్రోల్ ధరల విషయానికి వస్తే.. ముందు 2 రూపాయలు పెంచినట్టు ప్రచారం జరిగింది. దీనిపై కేంద్రం కాసేపటికే క్లారిటీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు అంటూ వార్తలు వచ్చాయి. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.2 పెంచినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రజలపై పెట్రోల్ ధరల పెంపు భారం ఉండదని స్పష్టం చేసింది. ఎక్సైజ్ సుంకం ఆయిల్ కంపెనీలే భరిస్తాయని.. పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదన్న కేంద్రం స్పష్టం చేసింది.