తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు సన్నద్ధం అవుతుంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలోపేతం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పార్టీని కట్టడి చేసేందుకు హిందూ ఓటర్లను దగ్గర చేసుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో దేవాలయాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. గతంలో కెసిఆర్ ఇదే ప్రయత్నాలు చేసి ఎన్నో దేవాలయాలకు నిధులు కేటాయించారు.
Also Read : రేవంత్ తో మీటింగ్ దూరంగా చిరంజీవి.. ఇందుకేనా?
ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నారు. భారతీయ జనతా పార్టీని కట్టడి చేయాలంటే హిందూ ఓటర్లను దూరం చేసుకోకుండా ఉంటే చాలు అనే భావనలో రేవంత్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో హిందువులకు కీలక పదవులు ఇచ్చే దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖకు సంబంధించి సలహాదారుగా ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుని నియమించాలని… ఆయనకు క్యాబినెట్ హోదా కల్పించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల చాగంటి కోటేశ్వరరావుకు విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు సలహాదారుగా నియమించింది.
Also Read : టోకెన్ ఉంటేనే శ్రీవారి దర్శనం.. టీటీడీ క్లారిటీ..!
ఆయనకు క్యాబినెట్ హోదా కూడా కల్పించారు చంద్రబాబు నాయుడు. అదే తరహాలో తెలంగాణలో దేవాదాయ శాఖను అభివృద్ధి చేసేందుకు… టెంపుల్ టూరిజంను వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా వాళ్ళ సహకారం కూడా తీసుకొనున్నారు. అందుకే గరికపాటి నరసింహారావుని సలహాదారుగా నియమించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ప్రవచనకర్తగా గరికిపాటికి మంచి పేరు ఉంది. అలాగే విద్యావేత్తగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. దీనితో ఆయన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని అంటున్నారు. అయితే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో విమర్శలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.