మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా… తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఎస్జే సూర్యా విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. రామ్ చరణ్ హీరోగా సోలో సినిమా ఏడేళ్ళ తర్వాత రావడంతో మెగా ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ లో కూడా చాలా అంచనాలే ఉన్నాయి.
Also Read : ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ… ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్టే..?
ఈ సినిమా హిట్ అయితేనే రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ కాస్త బలపడుతుంది. అలాగే సోలో గా పాన్ ఇండియా హిట్ కొట్టినట్టు అవుతుంది. అందుకే సినిమా ఆలస్యం అయినా సరే పక్కాగా ఉండేలా ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్. ఈ సినిమా కోసం రామ్ చరణ్ దాదాపుగా రెండేళ్ళ నుంచి కష్టపడుతున్నాడు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుంచి సోలో సినిమా లేదు… దానికి తోడు ఆచార్య సినిమా ఫ్లాప్ కావడం. ఇవన్నీ ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతుంటే… సినిమా భారీ బడ్జెట్ తో వస్తున్నా ప్రమోషన్స్ మాత్రం లేవు.
Also Read : కొడుకు కోసం బాలయ్య కమర్షియల్ థింకింగ్
చిన్న చిన్న సినిమాలకు కూడా ప్రమోషన్ ఓ రేంజ్ లో చేస్తుంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో గాని అప్డేట్స్ లో గాని చిత్ర యూనిట్ చాలా స్లో గా ఉంది. అందుకే ఇప్పటి నుంచి రెండు వారాలకు ఒక్క ఈవెంట్ నిర్వహించి ఏదోక అప్డేట్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు విడుదల చేయగా వాటికి మంచి స్పందన వచ్చింది. దీపావళి కానుకగా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. పోస్టర్ బాగున్నా ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేసారు. ఇక ఇప్పుడు టీజర్ ను గ్రాండ్ గా లక్నోలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. నార్త్ లో ప్రమోషన్స్ ముఖ్యం కాబట్టి అక్కడి నుంచే ఈవెంట్స్ స్టార్ట్ చేయనున్నారు.