2024 లో టీం ఇండియా హెడ్ కోచ్ గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాతి నుంచి.. బహుశా అతనికి టి20 వరల్డ్ కప్ మాత్రమే భారీ విజయంగా చెప్పుకోవచ్చు. స్వదేశంలో టెస్ట్ సీరీస్ లు వైట్ వాష్, విదేశాల్లో వన్డే సీరీస్లు, స్వదేశంలో వన్డే సీరీస్ ఓటమి ఇవన్నీ కూడా గంభీర్ ను విమర్శల దిశగా నడిపించాయి. కొందరు ఆటగాళ్లను పదే పదే గంభీర్ ప్రోత్సహించడం కూడా విమర్శలకు దారి తీసింది అనే చెప్పాలి. అలాంటిది ఇప్పుడు టి20 వరల్డ్ కప్ లో గంభీర్.. విమర్శలను ఎదుర్కొని జట్టును వరుసగా రెండవ సారి విశ్వ విజేతగా నిలిపాడు.
Also Read : చంద్రబాబు ఖాతాలో మరో రికార్డ్.. ఫస్ట్ ఛాన్స్ చంద్రబాబుకే..!
గెలిచిన సందర్భంగా గంభీర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అసలు గంభీర్ ఏం అన్నాడో ఒకసారి చూద్దాం. నా జవాబుదారీతనం సోషల్ మీడియాలోని వ్యక్తులకు కాదన్న గంభీర్.. డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న 30 మందికి నా జవాబుదారీతనం అని స్పష్టం చేసాడు. ఆటగాళ్ళు తనను మంచి కోచ్ గా మార్చారని కొనియాడాడు గంభీర్. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర కామెంట్ చేసాడు. టీం ఇండియా మాజీ కోచ్.. ద్రావిడ్, బీసీసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చీఫ్ లక్ష్మణ్ పై ప్రసంశలు కురిపించాడు.
Also Read : అమెరికాను ఆర్ధికంగా ముంచేస్తున్న ఇరాన్..!
ఈ ట్రోఫీని రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ లకు అంకితం చేస్తున్నాను అన్నాడు. భారత జట్టును ఒక స్థానంలో ఉంచినందుకు రాహుల్ భాయ్ కు, సీఓఈలో పర్ఫెక్ట్ రూట్ మ్యాప్ ఇచ్చినందుకు లక్ష్మణ్ కు అంకితం చేస్తున్నా అన్నాడు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, ప్రస్తుత ఐసిసి చైర్మన్, మాజీ బిసిసిఐ కార్యదర్శి జై షాలకు కూడా కృతజ్ఞతలు తెలిపాడు. విమర్శలు ఎదుర్కొని అజిత్ అగార్కర్ సమర్ధవంతంగా పని చేసాడని, స్వదేశంలో టెస్ట్ సీరీస్ లు ఓడిపోయిన తర్వాత తనకు జైషా నుంచి మద్దతు లభించిందని పేర్కొన్నాడు. తనతో కలిసి పనిచేసినందుకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను గంభీర్ ప్రశంసించాడు.

