వైసీపీ నేతల అవినీతి అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అప్పటి సిఎం జగన్ అండతో రెచ్చిపోయిన కొందరు ఎమ్మెల్యేలకు ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారు అధికారులు. వరుసగా అక్రమాలను బయటకు తీస్తున్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన కొందరు నేతలకు క్రమంగా ఉచ్చు బిగుస్తోంది. మాజీ మంత్రులు కాకాని, అనీల్ కుమార్ యాదవ్, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సహా కొందరు నేతలపై గట్టిగానే గురి పెట్టారు. వరుసగా సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు అధికారులు.
Also Read : తమ్ముడిపై కేశినేని నానీ మరో బాంబు
మరో మాజీ మంత్రి ఆర్కే రోజా అవినీతి, అక్రమాల వ్యవహారాలపై గట్టిగానే గురి పెట్టారు. ఇక నెల్లూరు జిల్లాకే చెందిన మాజీ ఎమ్మెల్యేకి ఉచ్చు బిగుస్తోంది. తెరపైకి వచ్చింది అమృత్ పథకం పైలాన్ కూల్చివేత కేసు. నెల్లూరు జిల్లా పై ఆరోపణలు వచ్చాయి గతంలో. 2018లో అమృత్ పథకం పైలాన్‍ని అప్పుడు మంత్రిగా ఉన్న నారా లోకేష్ ప్రారంభించారు. వైసీపీ అధికారంలోకి రాగానే పైలాన్ కూల్చివేయడం అప్పట్లో సంచలనంగా మారింది.
Also Read : ఒరాకిల్ తో ఏపి ప్రభుత్వం సంచలన ఒప్పందం
పైలాన్ని పగులగొట్టి చెరువులో పడేసిన వైనంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా టీడీపీ నేతలు డిమాండ్ కూడా చేసారు. పైలన్ కూల్చివేత కేసులో 12 మంది నిందితులు ఉండగా.. ఏ5గా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని చేర్చారు పోలీసులు. అప్పట్లో పైలాన్ కూల్చివేతపై ప్రజా సంఘాలు, కూటమి పార్టీలు పోరాటాలు చేసినా పోలీసులు మాత్రం చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం పైలాన్ కూల్చివేతపై విచారణ జరుగుతోంది. కావలికి చెందిన యూట్యూబ్ రిపోర్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనితో మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి.