2019 నుంచి 2024 వరకు అధికారులు గానీ వైసీపీ నాయకులు గానీ ఎవరైనా ప్రజలను వేధిస్తే వారి పేర్లను రెడ్ బుక్ లో మంత్రి నారా లోకేష్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఇది రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. కొంతమంది అధికారులు తమ స్థాయి మరిచి ప్రవర్తించడాన్ని లోకేష్ సీరియస్ గా తీసుకున్నారు. ఇక వైసిపి నాయకులు కూడా టిడిపి కార్యకర్తలను వేధించడంతో లోకేష్ దూకుడుగానే ఈ వ్యవహారంలో అప్పట్లో అధికార పక్షంపై ఆరోపణలు చేశారు. ఇది టిడిపి కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపటానికి ఎంతగానో ఉపయోగపడింది.
Also Read : రంగంలోకి జగన్.. క్యాడర్ తో మరో కీలక సమావేశం
ఇక ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది.. దీనితో తమ పార్టీ కార్యకర్తలను, నాయకులను వేధించిన అధికారులను గాని, నాయకులను గాని టార్గెట్ చేసేందుకు జగన్ వైసీపీ డిజిటల్ బుక్ పేరుతో ఒక యాప్ లాంచ్ చేశారు. ఈ బుక్ లో వైసీపీ కార్యకర్తలు, ప్రజలు తమను వేధించిన వారి పేర్లను నమోదు చేసేలా అవకాశం కల్పించారు. అయితే ఇప్పుడు ఇది వైసీపీకి రివర్స్ లో ఇబ్బందికరంగా మారింది. పలువురు వైసీపీ నాయకులు తమను గతంలో వేధించారని, తమ దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశారని ఆ పార్టీ కార్యకర్తలే డిజిటల్ బుక్ లో నమోదు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
Also Read : జూబ్లిహిల్స్ ఎన్నిక అప్పుడే.. బీహార్ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం..!
తాజాగా మాజీ ఎమ్మెల్యే తిప్పే స్వామిపై ఆ పార్టీ కార్యకర్తలు కొందరు ఫిర్యాదు చేశారు. ఏకంగా కౌన్సిలర్ కూడా తమ వద్ద 25 లక్షలు తీసుకుని మున్సిపల్ చైర్మన్ చేస్తానని హామీ ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ప్రతి కౌన్సిలర్ దగ్గర 70 వేల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు. అలాగే అంగన్వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తానని మాజీ ఎమ్మెల్యే 75 వేల రూపాయలు వసూలు చేశారని ఫిర్యాదు చేశారు. ఇక అనంతపురం జిల్లాలో కొంతమంది నాయకుల పేర్లు డిజిటల్ బుక్ లో నమోదు కావడం గమనార్హం. ఇదే సమయంలో ఓ మాజీ మంత్రి పేరు కూడా డిజిటల్ బుక్ లో నమోదు కావడంతో తర్వాత డిలీట్ చేశారు.