Wednesday, February 4, 2026 12:43 PM
Wednesday, February 4, 2026 12:43 PM

ఇంత ధీమాతో ఎలా ఉన్నారు ధర్మారెడ్డి గారు..?

I AM SAFE.. అనే ధీమాతో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి కన్పిస్తున్నారా..? అంటే అవుననే మాటే వినిపిస్తుంది. వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ ఇంఛార్జ్ ఈవోగా వ్యవహరించారు ధర్మారెడ్డి. అప్పట్లో అన్నీ తానే అయ్యారు. కొండ పైన ఈవో పెత్తనం మాత్రమే కొనసాగింది అనే మాట కంటే.. ఈవో హవా సాగిందనే మాట సరిగ్గా సరిపోతుంది. టికెట్ల కేటాయింపు మొదలు.. ఏ విషయం అయినా సరే.. నాటి ఇంఛార్జ్ ఈవో ధర్మారెడ్డి కనుసన్నల్లోనే జరిగాయనేది వాస్తవం. వైసీపీ పెద్దలు ఆదేశించారు.. ఈవో ధర్మారెడ్డి పాటించారు.. అని రజనీకాంత్ నరసింహ సినిమా డైలాగ్‌ గుర్తు చేసుకుంటారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొండపైన లెక్కలేనన్ని అక్రమాలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ.

Also Read : డ్రగ్స్ కేసులో దొరికిపోయిన స్టార్ హీరోయిన్ తమ్ముడు..?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో జరిగిన అక్రమాలపై ప్రధానంగా దృష్టి సారించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగం, పరకామణి చోరీ.. తాజా 50 కేజీల బంగారం చోరీ అంశం.. ఈ కేసులపై ఇప్పటికే ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. కల్తీ నెయ్యి, పరకామణి చోరీ కేసుల్లో టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, నాటీ ఈవో ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారించారు. ఈ కేసుల్లో అరెస్టులు ఖాయమనే మాట బాగా వినిపిస్తోంది. అయితే ఈ కేసుల్లో తనని ఎవరు ఏమీ చేయలేరు అనే ధీమా ధర్మారెడ్డిలో స్పష్టంగా కనిపిస్తోందనేది ఆయన సన్నిహితుల మాట. ధర్మారెడ్డిని దగ్గరగా చూసిన వారు కూడా ఇదే మాట చెబుతున్నారు.

ధర్మారెడ్డి అతి ధీమాకు ప్రధానం కారణం.. ఆయన వెనుక కేంద్ర మంత్రి మద్దతు అనేది ఇప్పుడు బాగా వినిపిస్తున్న మాట. ఆ కేంద్ర మంత్రి చెప్పిన మాట ముఖ్యమంత్రి చంద్రబాబు వింటారని.. ఆ విషయం ధర్మారెడ్డికి బాగా తెలుసనేది సన్నిహితుల మాట. అందుకే తనపై ఇన్ని ఆరోపణలు వచ్చినా సరే.. ఎలాంటి భయం లేకుండా.. అటు వైపు నుండి ధర్మారెడ్డి కథ నడుపుతున్నారనే మాట వినిపిస్తోంది. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ధర్మారెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత.. కనీసం ఆయన గురించి ప్రస్తావన కూడా ఎందుకు చేయటం లేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరితో ఎలా ఉండాలి.. ఎవరి బలం, బలహీనతలను ఎప్పుడు తనకు అనుకూలంగా మలుచుకోవాలనేది ధర్మారెడ్డికి బాగా తెలుసని.. ఆ విషయంలో ధర్మారెడ్డికి అపార అనుభవం ఉందనేది జగమెరిగిన సత్యం.

Also Read : నాపై కుట్ర జరుగుతోంది.. బాంబు పేల్చిన శివాజీ

కల్తీ నెయ్యి కుంభకోణంలో ధర్మారెడ్డి పాత్ర పెద్దగా లేదని.. అంతా పెద్దలు చెబితేనే చేశారనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది. నిజానికి వైసీపీ పాలనలో ధర్మారెడ్డి తెర వెనుక సాగించిన వ్యవహారం బయటకు వచ్చే అవకాశం లేదు. ఇందుకు ప్రధాన కారణం.. ధర్మారెడ్డి అత్యంత తెలివి ఉన్న అధికారి. కేంద్ర హోమ్ శాఖలో జాయింట్ సెక్రటరీగా అనేక సంవత్సరావు పని చేసిన అనుభవం ధర్మారెడ్డికి ఉంది. కేంద్రంలో కీలక స్థానంలో ఉన్న సమయంలో ప్రస్తుతం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా‌కు అత్యంత సన్నిహితంగా ధర్మారెడ్డి మెలిగారనేది ఢిల్లీలో చాలా మందికి తెలుసు. ఏపీలో 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా, జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా ధర్మారెడ్డి కేంద్రంలో పావులు కదిపారనే విమర్శలు అప్పట్లోనే వచ్చాయి.

జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. కేంద్ర పెద్దలకు ఆయన్ను దగ్గర చేసింది ధర్మారెడ్డి అని.. జగన్ ముఖ్యమైన పనులన్నీ కూడా ఢిల్లీలో ధర్మారెడ్డి చూసుకున్నారనేది సన్నిహితుల మాట. 2014-19 మధ్య కాలంలో అమిత్ షా బీజేపీ అధ్యక్షునిగా వ్యవహరించారు. ఆయనతో జగన్ మోహన్ రెడ్డికి అనేక రహస్య సమావేశాలు ఏర్పాటు చేశారని టీడీపీ ఎంపీలు చంద్రబాబుకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అయినా సరే.. చంద్రబాబు మాత్రం ధర్మారెడ్డి విషయాన్ని ఇప్పటికీ సీరియస్‌గా తీసుకోవటం లేదు. కల్తీ నెయ్యి కుంభకోణంలో అమిత్ షా సలహాతోనే ధర్మారెడ్డి అప్రూవర్‌గా మారారనే ప్రచారం కూడా జరుగుతోంది.

Also Read : బీజేపీలో దొంగలు పడ్డారు.. కోవర్టుల గోల..!

నా వెనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటు, టీడీపీ ఎంపీ వేమిరెడ్డి కూడా ఉన్నారని ధర్మారెడ్డి పదే పదే తన సన్నిహితుల వద్ద చెబుతున్నారట. అదే ధర్మారెడ్డి ధీమా కూడా. ప్రస్తుతం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంస్థలోనే ధర్మారెడ్డి సీఈవోగా చేస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ధర్మారెడ్డి ఏ మాత్రం భయపడటం లేదు అనేది టీడీపీలో, టీటీడీలో వినిపిస్తున్న మాట. జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ధర్మారెడ్డికి చంద్రబాబుపై పట్టలేనంత కోపం అనేది సన్నిహితుల మాట. అందుకే వైసీపీ పాలనలో టీటీడీ అదనపు ఈవోగా, ఇంఛార్జ్ ఈవోగా పని చేసిన సమయంలో టీడీపీ నేతలకు ధర్మారెడ్డి చుక్కలు చూపించారంట. తనపై కుట్రలు చేసిన వారిలో ధర్మారెడ్డి ఒకరని తెలిసినా కూడా.. చంద్రబాబు మాత్రం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండటానికి కేంద్ర పెద్దలే కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

పోల్స్