Friday, September 12, 2025 09:02 PM
Friday, September 12, 2025 09:02 PM
roots

అప్పుడు ఈ-వేలం కుంభకోణం అన్నారు.. ఇప్పుడు లీజులు ఇచ్చేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలకు అధికారంలో లేకపోయినా కూటమి ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా పనులు పూర్తిచేసుకుంటున్నారు. తాజాగా వైఎస్ కుటుంబానికి కడప జిల్లాలో అధికారులు కట్టబెట్టిన లీజుల వ్యవహారం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో ఆర్టీసీ చైర్మన్ గా వ్యవహరించిన అబ్బిరెడ్డిగారి మల్లికార్జున రెడ్డికి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా లీజులు మంజూరు అవుతున్నాయి. గత ప్రభుత్వంలో నిర్వహించిన ఈవేలంలో ఎవరిని పోటీకి రానివ్వకుండా చేసే భార్య, బినామీలుగా ఉన్న ఇద్దరు పిఏల పేరిట లీజులు కొట్టేయగా ఇప్పుడు వాటిని మంజూరు చేస్తూ గనుల శాఖ ఉత్తర్వులు ఇవ్వటం సెన్సేషన్ అయ్యింది.

Also Read : టీడీపీ పొలిట్‌బ్యూరో మీటింగ్‌.. ఇవే కీలకం..!

ఇప్పటికే మల్లికార్జున్ రెడ్డికి చెందిన మూడు లీజులు మంజూరయ్యాయి. తాజాగా మరో లీజ్ కట్టబెట్టేందుకు పత్రాలను కూడా సిద్ధం చేసి పెట్టారు. గత ప్రభుత్వంలో అమలులోకి తీసుకొచ్చిన ఈ వేలం ద్వారా లీజుల కేటాయింపు పెద్ద కుంభకోణం అనే ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి. వైసీపీ ముఖ్య నేతలు, అప్పటి ప్రభుత్వ పెద్దలు, ఇతర నేతలు, బినామీలకు లీజులు దక్కే విధంగా చూడటంలో ఈ వేలం విధానాన్ని వినియోగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు అప్పటి గనుల శాఖ డైరెక్టర్ గా ఉన్న వెంకటరెడ్డి అంతా తానై వ్యవహరించారు.

Also Read : యూట్యూబ్ లో తప్పుడు ప్రచారం.. టీటీడీ రియాక్షన్

లీజులను ఎవరికి కేటాయించాలనేది ముందే నిర్ణయించుకుని దానికి అనుగుణంగా కథ నడిపించేవారు. ఈ వేలంలో లీజులను కేటాయించేందుకు టెండర్లు పిలిచిన తర్వాత ముందుగా అనుకున్నవాళ్ళు కాకుండా ఇతరులు ఎవరైనా పోటీకి వస్తే ఆ టెండర్ల గడువును పెంచి ఈలోపు పోటీ దారులను బెదిరించి ముందడుగు వేయనివ్వకుండా అడ్డుకునేవారు. వాళ్లు దారికి రాకపోతే టెండర్ గడువు పెంచుతూనే ఉండేవారు .చివరకు వాళ్లను వెనక్కు తగ్గించేలా చేసి వైసిపి నేతలకు దక్కేలా చేసేవారు.

Also Read : పెద్దిరెడ్డిపై పవన్ కళ్యాణ్ గురి

అలా ఈ వేలంలో లీజులు దక్కించుకున్న మల్లికార్జున రెడ్డికి చెందిన మరో లీజును కట్టబెట్టేందుకు ప్రస్తుత ప్రభుత్వం సిద్ధం కావడం విమర్శలకు దారితీస్తుంది. ఐదు హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న లీజు అయితే ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సి ఉంటుంది. అందుకే తెలివిగా 4.95 హెక్టార్ల చొప్పున రెండు లీజులుగా దాన్ని విభజించి అప్పట్లో టెండర్ వేశారు. మల్లికార్జున్ రెడ్డికి పీఏ గా ఉండే నేలటూరి శివానందరెడ్డి కి ఈ వేలంలో దక్కినట్లు 2023 జూలైలో చూపించారు. అనంతరం వివిధ అనుమతులకు ఈ రెండు దస్త్రాలు పరుగులు పెట్టగా… శివానందరెడ్డి పేరిట 20 ఏళ్ల కాల వ్యవధితో ఇటీవల లీజు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక మల్లికార్జున రెడ్డి భార్య సువర్ణ కు చెందిన శ్రీ సాయి మైన్స్ అండ్ మినరల్స్ కు ఈ నెల 4 న పర్యావరణ మదింపు అనుమతులు కూడా రావడం గమనార్హం. త్వరలోనే లీజు కట్టబెట్టే అనుమతులకు కూడా గనుల శాఖ రంగం సిద్ధం చేసింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్