భారత ఆర్ధిక వ్యవస్థకు ఊపిరి అందించిన ఓ దిగ్గజం తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. దేశ ఆర్ధిక ప్రగతిని పరుగులు పెట్టించిన ఆర్ధిక వేత్త సెలవు తీసుకున్నాడు. అవినీతి రొచ్చులో పడి కొట్టుకుంటున్న రాజకీయ నేతల నడుమ… అవినీతి మరక లేని నేత తన దేశ ప్రజలకు వీడ్కోలు పలికాడు. భారత మాజీ ప్రధాని, ప్రపంచం మెచ్చిన ఆర్ధిక వేత్త మన్మోహన్ కన్నుమూసారు. డిమాండ్ కు తగ్గ సప్లై ఉండాలని దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో కన్నుమూసారు.
Also Read : గరికపాటికి రేవంత్ కీలక పదవి…!
26 సెప్టెంబరు 1932 లో జన్మించిన మన్మోహన్… ఉన్నత విద్యను అభ్యసించారు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో 1952లో బీఏ, 1954లో ఎంఏ పట్టా కేంబ్రిడ్జ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో ట్రైపోస్, ఆక్స్‌ఫర్డ్ నుంచి ఎం.ఎ. డి.ఫిల్ (1962) హోనరిస్ కాసా నుంచి డి.లిట్ వంటి ఉన్నత విద్యను అభ్యసించిన మన్మోహన్… రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా సేవలు అందించారు. ఆయన పని తీరు మెచ్చిన అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు… కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించారు. 1991 లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు మన్మోహన్.
Also Read : ఇద్దరు ఇన్.. ఇద్దరు ఔట్.. ముహుర్తం ఫిక్స్..!
అదే ఏడాది… అంటే 1991లో కేంద్ర కేబినేట్ లో అడుగుపెట్టారు. అక్కడి నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసారు. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు. దేశాన్ని సుదీర్ఘకాలంపాటు పాలించిన ప్రధానుల్లో ఒకరు మన్మోహన్. ప్రధాని పీఠాన్ని అధిష్టించిన తొలి హిందూయేతర వ్యక్తిగా మన్మోహన్ రికార్డు సృష్టించారు. మన్మోహన్ సింగ్ హయాంలో అత్యధిక జీడీపీ (10.2శాతం) వృద్ధిరేటు నమోదు కావడం గమనార్హం. మన్మోహన్ హయాంలోనే వెనుకబడిన వర్గాలకు 27శాతం సీట్ల కేటాయింపు జరగడం గమనార్హం.