ఆసియా క్రికెట్ జట్లు విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు బ్యాటింగ్, బౌలింగ్ లో లోపాలు బయటపడుతూ ఉంటాయి. ఒక్క పాకిస్తాన్ మినహా మిగిలిన దేశాలు ఫాస్ట్ బౌలింగ్ మీద దృష్టి పెట్టవు. ఈ ప్రభావం బ్యాటింగ్ మీద కూడా పడుతూ ఉంటుంది. నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లను తయారు చేసుకోవడంలో ముఖ్యంగా భారత్, శ్రీలంక వంటి దేశాలు ఫెయిల్ అయ్యాయి. దీనితో బ్యాట్స్మెన్ లు ప్రాక్టీస్ చేసే సమయంలో సరైన బౌలర్లు ఉండటం లేదనే మాట కూడా వినపడుతూ ఉంటుంది.
Also Read : రోహిత్ – కోహ్లీ రిటైర్మెంట్ పై బోర్డ్ సంచలన కామెంట్స్
ఇప్పుడు కెప్టెన్ శుభమన్ గిల్ బ్యాటింగ్ టెక్నిక్ విషయంలో ఈ విమర్శ ఎక్కువగా వస్తుంది. వాస్తవానికి గిల్ బ్యాటింగ్ టెక్నిక్ భారత్ లో మాత్రమే బాగుంటుంది అనే విమర్శ ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పర్యటనలలో గిల్ ఎక్కువగా ఫెయిల్ అవుతున్నాడు. అయితే ఇంగ్లాండ్ తో రెండు టెస్టుల్లో గిల్ అంచనాలకు మించి రాణించాడు. కాని మూడవ టెస్ట్ విషయానికి వచ్చేసరికి.. లోపాలు బయటపడ్డాయి. కీలక సమయంలో గిల్ వికెట్ పారేసుకోవడంపై దిగ్గజ ఆటగాళ్ళు విమర్శలు చేస్తున్నారు.
Also Read : పాకిస్తాన్ షాక్.. కలలో కూడా ఊహించని గన్ తయారు చేసిన భారత్
లీడింగ్ రన్ స్కోరర్ గా ఉన్న గిల్.. బ్యాటింగ్ టెక్నిక్ పై ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైకేల్ వాన్ విమర్శలు చేసాడు. రెండో ఇన్నింగ్స్ లో గిల్ బ్యాటింగ్ టెక్నిక్ గొప్పగా లేదన్నాడు వాన్. అతను బ్యాటింగ్ కు వచ్చినప్పుడు ఒత్తిడిగా కనిపించాడు అని, ఈ ప్రభావం ఇతర ఆటగాళ్ళపై కూడా పడింది అన్నాడు. గిల్ బ్యాటింగ్ టెక్నిక్ చాలా డెవెలప్ కావాల్సి ఉందన్నాడు. సిరాజ్, నితీష్, బూమ్రా కంటే గిల్ తక్కువ బంతులు ఆడాడు. డిఫెన్స్ లో సిరాజ్, బూమ్రా ఏ తప్పు చేయలేదు. కాని గిల్ మాత్రం డిఫెన్స్ విషయంలో ఇబ్బంది పడ్డాడు.