Friday, September 12, 2025 11:10 PM
Friday, September 12, 2025 11:10 PM
roots

రెడ్ అలెర్ట్: అంతా కల్తీ మయం… టేస్ట్ లో వరస్ట్..!

కల్తీ రాయుళ్ల పుణ్యమా అని హైదరాబాద్ బ్రాండ్ పూర్తిగా దెబ్బ తిన్నది. ఆహార నాణ్యతలో హైదరాబాద్ స్థానం లాస్ట్ ప్లేస్‌లో ఉంది. ఇక ప్రపంచ ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ బిర్యానీ పరిస్థితి అయితే… నిషేధిత ఫుడ్ కలర్స్ కలుపుతున్నారని తేలటంతో… బిర్యానీ లవర్స్ గుండెల్లో రాయి పడినట్లుగా అయ్యింది. వారంలో ఒకరోజు బయటకు వెళ్లి తినటం అనేది ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఇక వీకెండ్‌లో అయితే ఐ లవ్ స్ట్రీట్ ఫుడ్ అనేస్తున్నారు. ఇడ్లీ మొదలు… బిర్యానీ వరకు ఏదైనా సరే బయటే. ఇక పిజ్జా, బర్గర్, షవర్మా, కబాబ్… ఇలా నాన్ వెజ్ ప్రేమికుల కోసం చాలా వెరైటీలున్నాయి. అయితే ఈ వెరైటీల మాటున అనారోగ్యం కూడా రెడీగా ఉందంటు సర్వే రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.

దీనికి ప్రధానంగా ఆహారంలో వినియోగించే కల్తీ పదార్థాలే కారణంటూ తాజాగా నివేదిక విడుదల చేసింది. దీంతో బయట భోజనం చేయాలంటేనే భయపడే పరిస్థితి. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన తనిఖీల్లో బడా రెస్టారెంట్లల్లో కూడా నాసిరకం, కుళ్లిన పదార్థాలు, పాచిపోయిన మాంసం దర్శనమిచ్చాయి. కొన్ని రెస్టారెంట్లల్లో అయితే జెర్రులు కూడా కస్టమర్లకు వస్తున్నాయి. వాస్తవానికి హైదరాబాద్‌లో గుర్తింపు పొందిన రెస్టారెంట్లు సుమారు 72 వేల వరకు ఉంటాయి. ఇక వీధి టిఫిన్ బండ్లు అయితే లెక్కే లేదు. వీటి ద్వారా ప్రతి ఏటా వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఇక యూట్యూబర్లు, సోషల్ మీడియా పుణ్యమా అని… కుమారి ఆంటీ లాంటీ వారు బాగా ఫేమస్ అయ్యారు.

Also Read : ఆ నియోజకవర్గాల్లో వాళ్లే రింగ్ లీడర్స్…!

అలాంటి వారి వద్ద ఒక్కసారి అయినా తినాలని క్యూ కట్టే వారి సంఖ్య కూడా ఉంది. అయితే ధనార్జనే ప్రధానంగా వ్యాపారం చేస్తున్న హోటళ్లు.. నాణ్యతను తుంగలో తొక్కేస్తున్నాయి. చివరికి అల్లం వెల్లుల్లి పేస్టులో కుళ్లిన అల్లం, పాడైన వెల్లుల్లి వినియోగిస్తున్నట్లు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. దీనినే స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులకు సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఇక ఆయిల్ కల్తీ కూడా సేమ్ టూ సేమ్. జంతువుల కొవ్వు నుంచి తీసిన ఆయిల్‌ను వినియోగిస్తున్నారు. దీని వల్ల గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటున్నారు వైద్యులు.

ఫుడ్ కల్తీలో హైదరాబాద్ నంబర్ వన్ ప్లేస్‌లో ఉందని నేషనల్ క్రైమ్ సర్వే రికార్డ్స్ బ్యూరో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దీనికి ప్రధానంగా ప్రభుత్వాల నిర్లక్ష్యం అనేది స్పష్టంగా తెలుస్తోంది. జనాభా ప్రాతిపదికన ఇప్పటి వరకు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లను జీహెచ్ఎంసీ నియమించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేవలం 23 మంది మాత్రమే ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. ప్రతిరోజు పది హోటళ్లు తనిఖీ చేసినా కూడా… వీరు చేయగలిగేది ఏడాదికి 3,500 మాత్రమే. అలా చేయడం అసాధ్యం కూడా. పైగా వీరు అవినీతి పాల్పడే అవకాశం లేకపోలేదు కూడా.

Also Read : జగన్‌కు బైబై చెప్పనున్న మరో సీనియర్ నేత..!

కాబట్టి జనాభా ప్రాతిపదికన కాకుండా… ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల పోస్టులు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందనే మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు బయట ఎన్నో హంగామాలు చేస్తున్న హోటళ్ల యజమానులు… తమ కిచెన్‌లో మాత్రం నాసిరకం సరుకులు వినియోగిస్తున్నారు. అశుభ్రమైన వాతావరణం వల్ల ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్