Friday, September 12, 2025 06:58 PM
Friday, September 12, 2025 06:58 PM
roots

ఇందిరా గాంధీ పేరే నచ్చదు.. ఫడ్నవీస్ గురించి ఎవరికి తెలియని 5 విషయాలు

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ డిసెంబర్ 5 అనగా గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫడ్నవీస్ బుధవారం మహారాష్ట్ర బిజెపి శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనితో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమం అయింది. మూడవసారి ఆయన మరాఠా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో గురువారం దక్షిణ ముంబైలోని విశాలమైన ఆజాద్ మైదాన్‌లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు.

Also Read : నోర్ముయ్.. ప్రెస్‌మీట్‌లోనే అజిత్ పవార్‌పై ఏక్‌నాథ్ షిండే ఫైర్

ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసారు. ఇదే వేడుకలో శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే, ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, కోర్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. మహాయుతి కూటమి నేతలు బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని కోరినట్టు బీజేపీ నేత సుధీర్ ముంగంటివార్ ప్రకటించారు.

ఇక దేవేంద్ర ఫడ్నవీస్ గురించి ఎవరికి తెలియని 5 విషయాలు చూద్దాం.

లాయర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఫడ్నవీస్ ఆ తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో జాయిన్ అయ్యారు. క్షేత్ర స్థాయి నుంచి బిజేపి కీలక నేత వరకు ఆయన ప్రయాణం సాగింది. నాగ్‌పూర్‌లో 22 ఏళ్లకే కార్పొరేటర్‌గా పని చేసారు ఫడ్నవీస్. నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గం నుండి ఆయన వరుసగా ఆరు సార్లు విజయం సాధించారు అంటే ఆయనకు ఆ ప్రాంతంలో ఏ స్థాయిలో పట్టు ఉందో అర్ధం చేసుకోవచ్చు.

54 ఏళ్ళ ఫడ్నవీస్ ముందు నుంచి కాంగ్రెస్ వ్యతిరేకి. తన తండ్రిని ఎమర్జెన్సీ సమయంలో జైల్లో పెట్టడంతో ఇందిరా గాంధీని తీవ్రంగా వ్యతిరేకించారు ఫడ్నవీస్. అందుకే చిన్న వయసులో ఆయన ఇందిరా పేరు ఉన్న ఇందిరా కాన్వెంట్‌లో చదువుకోవడానికి నిరాకరించారట. అనంతరం సరస్వతీ విద్యాలయంలో స్కూలింగ్ పూర్తి చేసారు ఫడ్నవీస్. అక్కడి నుంచే ఆయనకు రాజకీయాలపై ఆసక్తి కలిగింది.

Also Read : జగనన్నను కార్యకర్తలే వద్దంటున్నారా…..?

కేవలం 27 సంవత్సరాల వయస్సులో, దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్‌పూర్ అతి పిన్న వయస్కుడైన మేయర్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మహారాష్ట్ర రెండవ బ్రాహ్మణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆర్‌ఎస్‌ఎస్ జాయింట్ జనరల్ సెక్రటరీ అతుల్ లిమాయేతో కలిసి సంఘ్ పరివార్ లో పనిచేశారు. అనంతరం ఓటర్లతో కనెక్ట్ అవ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నినాదం… “ఏక్ హై తో సేఫ్ హై” నినాదాన్ని సమర్థవంతంగా వాడుకున్నారు. మౌలానా సజ్జాద్ నోమాని ఇచ్చిన నినాదం “ఓటు జిహాద్” వ్యతిరేకంగా హిందూ ఓటర్లను ప్రభావితం చేయడానికి ఎన్నికలను “ధర్మ యుద్ద్”గా ప్రకటించారు.

ఫడ్నవీస్‌ ను ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా చెప్తారు. అదే ఆయనకు రాజకీయాల్లో కలిసి వచ్చిందని అంటారు. మరాఠా రిజర్వేషన్ సమస్య, ముంబై-నాగ్‌పూర్ సమృద్ధి మహామార్గ్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ప్రారంభించడం, పోలీసు శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టడం వంటి కీలక సమస్యలను పరిష్కరించిన ఆయనకు మరాఠా ఓటర్లు పట్టం కట్టారు. 2014లో ఆయన మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Also Read : మరో ఐపిఎస్ కు మూడింది

జలవనరుల శాఖలో జరిగిన ఓ కుంభకోణామే ఆయన్ను నాయకుడ్ని చేసింది అంటారు. అవినీతికి వ్యతిరేకంగా ఆయన అప్పట్లో బలమైన పోరాటమే చేసారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జల్ యుక్త్ శివర్ వంటి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సాగు, తాగు నీటి సమస్యలను పరిష్కరించాయని చెప్తారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

పోల్స్