Friday, September 12, 2025 11:23 PM
Friday, September 12, 2025 11:23 PM
roots

అమరావతిలో ఫిలిం సిటీ.. కారణం అదేనా..!

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్… అదే అల్లు అర్జున్ అరెస్ట్… సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగం. దీంతో టాలీవుడ్ ప్రముఖుల దృష్టి ఇప్పుడు అమరావతి నగరం వైపు మళ్లిందనే చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణం… ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. వీరిద్దరికి టాలీవుడ్‌తో చాలా మంచి సంబంధాలున్నాయి. ఇద్దరు చిత్ర పరిశ్రమతో సంబంధం ఉన్న వాళ్లే. ఎన్టీఆర్ అల్లుడిగానే కాకుండా… టాలీవుడ్ హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్‌, నారా రోహిత్‌కు చంద్రబాబు నాయుడు సమీప బంధువు కూడా.

Also Read: బన్నీ ఎఫెక్ట్.. టాలీవుడ్‌లో కొత్త భయం..!

ఇక మెగా కుటుంబానికి చెందిన పవన్ కల్యాణ్‌‌కు నిర్మాతలు, హీరోలు, నటులు చాలా మంది బంధువులు, సన్నిహితులున్నారు. దీంతో టాలీవుడ్ ప్రముఖుల దృష్టి ఇప్పుడు ఏపీపై పడింది. వాస్తవానికి తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసులో ఉన్నప్పుడు కూడా చాలా సినిమాల షూటింగ్‌ ఇటు వైజాగ్, గోదావరి జిల్లాలోనే సాగింది. అలాగే తెలుగు సినిమా రివ్యూ కూడా ముందుగా నెల్లూరు, విజయవాడలోనే వచ్చేది. ఏపీలో సినిమా ప్రేమికులు ఎక్కువ. ఇక చెన్నై నుంచి పరిశ్రమ హైదరాబాద్ రావడానికి ప్రధాన కారణం ఎన్టీఆర్. చిత్రపురి కాలనీ, ఫిలిం నగర్‌లో అందరికీ స్థలాల కేటాయింపు చేశారు. అదే సమయంలో రామోజీ ఫిలింసిటీ, రామానాయుడు స్టూడియోల నిర్మాణానికి చంద్రబాబు ఎంతో సహకరించారు.

Also Read: సీఎం రేవంత్ వ్యాఖ్యలు బాధ కలిగించాయి-అల్లు అర్జున్

అలాగే రాఘవేంద్రరావుకు ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి, రామానాయుడు, అశ్వనీదత్‌, మురళీమోహన్ వంటి ప్రముఖులకు ఎంపీ టికెట్లు, అంబికా కృష్ణ, చెంగల వెంకట్రావు వంటి నిర్మాతలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు చంద్రబాబు. మహేశ్ బాబు సొంత బావ గల్లా జయదేవ్‌కు వరుసగా రెండుసార్లు ఎంపీ టికెట్ ఇచ్చారు. అలాగే విశాఖలో రామానాయుడు స్టూడియో నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు కూడా చంద్రబాబు హయాంలోనే వచ్చాయి. సినీ పరిశ్రమపై రేవంత్ సర్కార్ కాస్త గుర్రుగా ఉన్న మాట వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం ఉత్తమం అనేది టాలీవుడ్ ప్రముఖుల ఆలోచన. అందుకే ఏపీ సర్కార్‌తో పొత్తు పెట్టుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read: చంద్రబాబు భద్రత భారీగా కుదింపు.. ఎందుకో తెలుసా?

ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖ నిర్మాత సురేష్ బాబు… అమరావతిలో ఫిలింసిటీ నిర్మాణం ప్రపోజల్ పెట్టారు. సినీ ప్రముఖులంతా అమరావతి వచ్చేందుకు రెడీ అని చెప్పేశారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని… ఇందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. అశ్వనీదత్ కూడా త్వరలో అమరావతిలో మల్టీప్లెక్స్ నిర్మించాలని భావిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అమరావతికి షిఫ్ట్ అయితే ఖర్చులు కూడా కలిసి వస్తాయనేది చిన్న నిర్మాతల ఆలోచన. దీంతో అమరావతిలో నిర్మించనున్న నవ నగరాల నిర్మాణాలకు ఫిలింసిటీ కూడా జోడించాలనేది టాలీవుడ్ నుంచి వస్తున్న ప్రపోజల్. మరి దీనికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ జోడీ ఏ విధంగా సహకరిస్తుందో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్