Monday, October 27, 2025 10:44 PM
Monday, October 27, 2025 10:44 PM
roots

కార్యకర్తలు.. అభిమానులు ఒక్కటే అని ప్రూవ్ చేసిన పుష్ప 2

సాధారణంగా రాజకీయ నాయకులు పార్టీ కార్యకర్తలను తమ అధికారం కోసం వాడుకుంటారు అనే విమర్శలు మనం తరచుగా వింటూనే ఉంటాం. అధికారంలోకి వచ్చేవరకు కార్యకర్తలు గురించి ఉపన్యాసాలు ఇచ్చే నాయకులు అధికారం కోల్పోయిన తర్వాత కార్యకర్తలను పెద్దగా పట్టించుకున్న పరిస్థితి ఉండదు. దేశంలో చాలా రాజకీయ పార్టీల పరిస్థితి ఇలాగే ఉంటుంది. కాకపోతే ఆయా నాయకులపై అలాగే పార్టీలపై ఉన్న అభిమానంతో కార్యకర్తలు కష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు ఇది సినిమాలకు కూడా పాకింది అనే విషయం పుష్ప సినిమాతో క్లియర్ గా అర్థమవుతుంది.

అభిమానుల గురించి పదేపదే ఉపన్యాసాలు ఇస్తున్న అల్లు అర్జున్ ఇప్పుడు అభిమానుల జేబులకు చిల్లు పెట్టాలనుకోవడం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. పుష్ప సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులు ఎదురు చూస్తున్న మాట వాస్తవమే.. సినిమాకు భారీగా బజ్ క్రియేట్ అయింది. గతంలో ఏ తెలుగు సినిమాకు అసలు ఏ ఇండియన్ సినిమాకు ఈ రేంజ్ లో క్రేజ్ లేదు అనే మాట అక్షరాల నిజం. బాహుబలి సినిమా కూడా ఈ సినిమా తరహాలో పాపులర్ కాలేకపోయింది.

Also Read : NRI: భార్యను చంపి రెండో పెళ్లి గురించి గూగుల్ చేసిన ఎన్నారై

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ క్రికెటర్లు కూడా కొంతమంది ఈ సినిమా కోసం ప్రమోషన్ చేశారు. ఇక ఈ సినిమా కోసం ఐదేళ్ల నుంచి అల్లు అర్జున్ తీవ్రంగా కష్టపడుతున్నాడు. డైరెక్టర్ సుకుమార్ కూడా తన కెరీర్ లోనే భారీ ప్రాజెక్టు కోసం ఫ్యూచర్ ప్రాజెక్టులను కూడా పక్కనపెట్టి ఈ సినిమా కోసం పూర్తిస్థాయిలో వర్కౌట్ చేశాడు. ఇక నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా కోసం ఖర్చు పెట్టింది. అక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఈ సినిమాకు ఉన్న క్రేజ్ నీ దృష్టిలో పెట్టుకుని ఆడియోస్ నుంచి అలాగే తన అభిమానుల నుంచి అల్లు అర్జున్ దోచుకోవాలనుకుంటున్నాడు అనే అభిప్రాయం చాలా మందిలో కలుగుతుంది.

సినిమా టికెట్ ధరలు చూస్తే కొన్నిచోట్ల 1500 వరకు ఉన్నాయి. బెనిఫిట్స్ షోస్, అదనపు షోస్ పేరుతో పెద్ద ఎత్తున అభిమానుల నుంచి వసూలు చేస్తున్నారు. నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా పుష్పా టూ టికెట్ రేట్లను పెంచేశారు. దీనిపై హైకోర్టు కూడా ఏమి చేయలేమంటూ చేతులెత్తేసింది. ఆఖరి నిమిషంలో తాము విడుదలను అడ్డుకోలేమంటూ ప్రకటన చేసింది. దీనితో ఇప్పుడు అభిమానుల పరిస్థితి చూసి చాలామంది బాధపడుతున్నారు. సినిమా కోసం ఎదురుచూసినందుకు తాము కాయకష్టం చేసే సంపాదించిన డబ్బును సినిమా హీరోలు దోచుకుపోవడం, వినోదం పేరుతో అలాగే అభిమానం పేరుతో తమను దోచుకోవడం చూసి చాలా మంది అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.

Also Read : మెగా Vs అల్లు రచ్చ.. క్లారిటీ వచ్చేది నేడే..!

ఎప్పుడో విపత్తుల సమయంలో మినహా పెద్దగా సినిమా హీరోలు అభిమానులకు అండగా నిలబడిన పరిస్థితి ఉండదు సేవా కార్యక్రమాలు కూడా పెద్దగా హీరోలు ప్రాధాన్యత ఇవ్వరు. ఎక్కడో ఒక హీరో మాత్రమే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. గతంలో ఏ సినిమాకు లేనివిధంగా టికెట్ ధరలను పెంచడం చూసి సినిమా పిచ్చోళ్ళు కూడా షాక్ అవుతున్నారు. సినిమాకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని అన్ని కాడికి దోచుకునేందుకు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సిద్ధమైంది అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాకుండా సాధారణ ప్రజలు కూడా మండిపడుతున్నారు. ఇక ప్రభుత్వాలు కూడా టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం పై సీరియస్ అవుతున్నారు. వినోదాన్ని వినోదంగా చూడకుండా హీరోల కోసం ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదంటూ హెచ్చరిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్