Friday, September 12, 2025 07:26 PM
Friday, September 12, 2025 07:26 PM
roots

వెంకన్న ఇలాకాలో నకిలీలు..!

వెంకన్న దర్శన టికెట్లకు ఉన్న డిమాండ్‌ని కొందరు ఇంటి దొంగలు సొమ్ము చేసుకుంటున్నారు. వ్యవస్థలో చిన్న చిన్న లోపాలను ఆసరాగా చేసుకొని.. ఎదుట వారి అవసరాలను పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. భారీ స్థాయిలో ధనార్జనకు దిగుతున్నారు.

ఏడుకొండల వాడి క్షణకాల దర్శనం కోసం భక్తులు పరితపిస్తుంటారు. ఇక వైకుంఠ ద్వారా దర్శనం కోసం ఐతే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వైకుంఠ నాధుడి దర్శనానికి ఉన్న డిమాండ్‌ని కొందరు ఇంటి దొంగలు క్యాష్ చేసుకుంటున్నారు. దర్శనం చేయిస్తే ఎంత డబ్బయినా చెల్లించేందుకు భక్తులు సిద్ధం కావడం దళారులకు వరమైంది. ఆ ప్రక్రియనే వాళ్లు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. వెంకన్న దర్శనానికి ముందే భక్తులను నిలువునా దోచుకుంటున్నారు. ఈ దందాలో కొత్త కొత్త ట్విస్టులు కూడా ఇస్తున్నారు. నకిలీ టికెట్లతో భక్తులను దర్శనానికి పంపి వారికి కొత్త ఇబ్బందులను సృష్టిస్తున్నారు.

Also Read : కేబినెట్‌లో క్లారిటీ వస్తుందా..?

టీటీడీ జారీ చేసిన టికెట్లతో దర్శనమైతే ఇబ్బంది ఉండదు. నకిలీ టికెట్స్ సృష్టించి దర్శనం చేయించడమంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు. నకిలీ టికెట్ల ద్వారా దర్శనం ఎలా చేయిస్తారనేది కూడా పెద్ద ప్రశ్నే. దర్శనం చేయించడానికి దళారీలు చేస్తున్న తంతు చూస్తే ఎవరైనా ఆశ్చర్య పడాల్సిందే. తిరుమల – తిరుపతి మధ్య వాహనాలను నడిపే డ్రైవర్లతో పాటు.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అనుమతించే సమయంలో టికెట్లను వెరిఫై చేసే కాంట్రాక్టు ఉద్యోగి, అగ్నిమాపక శాఖలో పనిచేసే ఇద్దరు సిబ్బంది ఓ ముఠాగా ఏర్పడి కొంతకాలంగా టికెట్ల దందా కొనసాగిస్తున్నట్లుగా తెలిసింది. తిరుపతికి చెందిన టాక్సీ డ్రైవర్లు శశి, చెన్నైకి చెందిన డ్రైవర్ జగదీష్, అగ్నిమాపక పీఎస్జీలు మణికంఠ, భానుప్రకాష్‌లు, కౌంటర్ సిబ్బంది లక్ష్మీపతి ఓ ముఠాగా ఏర్పడ్డారు. క్యాబ్ డ్రైవర్ల వద్ద శ్రీవారి దర్శనం టికెట్లను ఆశ్రయించే భక్తులను అగ్నిమాపక సిబ్బందికి అప్పజెప్తున్నారు. అనంతరం వారు తయారు చేసిన నకిలీ టికెట్లను భక్తులకు కేటాయిస్తున్నారు. ఇలా కొన్నాళ్ళుగా సాగుతున్న ఈ నకిలీ టికెట్ల దందాపై అనుమానం వచ్చిన విజిలెన్స్ అధికారులు వీరిపై నిఘా పెట్టారు. భక్తులు తీసుకువచ్చిన టికెట్లను స్కాన్ చేయకుండా.. టికెట్స్ కౌంటర్ వద్ద విధుల్లో వుండే లక్ష్మీపతి అనుమతించడాన్ని గుర్తించారు. వెంటనే విజిలెన్స్ సిబ్బంది భక్తులతో సహా లక్షిపతిని అదుపులోకి తీసుకోవడంతో..తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ నకిలీ టికెట్ల దందా బట్టబయలైంది.

Also Read : స్టీల్‌ ప్లాంట్‌.. చంద్రబాబు గ్రాండ్‌ సక్సెస్‌

హైదరాబాద్, పొద్దుటూరు, బెంగళూర్ నుంచి శ్రీవారి దర్శనార్ధం వచ్చిన 11మంది భక్తులు వద్ద నుంచి 19 వేలు వసూలు చేసి.. స్వామి వారి దర్శనం కల్పిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నట్లు విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని భక్తుల వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. దళారీలను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ వింగ్ అధికారులు వారిని విచారించిన అనంతరం వన్ టౌన్ పోలీసులకు అప్పగించి.. ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఈ నకిలీ టికెట్ల దందా గత కొంతకాలంగా జరుగుతున్నట్లు ఇప్పటికే ప్రాథమికంగా ఆధారాలు సేకరించిన పోలీసులు.. ప్రత్యేక టీంతో పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించారు. ఈ దందాలో మరికొందరు నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకోనున్నట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్