కల్తీ మద్యం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మందు బాబులను భయపెడుతోంది. ఐదేళ్లపాటు మద్యం విషయంలో భయపడిన మందుబాబులు ఇప్పుడు కూడా అదే స్థాయిలో భయపడే పరిస్థితి ఏర్పడింది. కల్తీ మద్యం కారణంగా ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్న సరే.. డబ్బుకు ఆశపడి కల్తీ మద్యాన్ని తయారు చేసి విక్రయిస్తున్నారు వ్యాపారులు. మంచి మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల వద్ద నుంచి భారీగా వసూలు చేసిన సరే.. కల్తీ మద్యం వ్యాపారం మాత్రం ఆగటం లేదు. అటు ప్రభుత్వం కూడా.. ఎన్నో చర్యలు తీసుకుంటున్నా సరే కల్తీ వ్యాపారులు మాత్రం తమ పని తాము చేస్తున్నారు.
Also Read : విద్యార్థుల మనసు గెలిచిన లోకేష్.. మరో సంచలన నిర్ణయం
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా అలాగే ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద ఎత్తున కల్తీ మద్యం గుర్తించారు. బార్లలో రద్దీ సమయాల్లో ఈ కల్తీ మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. తాజాగా ఇబ్రహీంపట్నంలో అదుపులోకి తీసుకున్న కొంతమంది నిందితులు వెల్లడించిన వివరాలు తెలిస్తే.. మద్యం జోలికి వెళ్లాలంటేనే భయపడే విధంగా ఉన్నాయి. నకిలీ మద్యాన్ని తయారు చేసి బార్లు రద్దీగా ఉండే సమయంలో దానిని విక్రయించే విధంగా ఒప్పందాలు చేసుకున్నట్లు గుర్తించారు. ఇలా తయారు చేస్తే ప్రస్తుతం వచ్చే జీతం కంటే ఎక్కువ ఇస్తామని అక్కడ పనిచేసే వారిని ఆశపెట్టినట్లు వెల్లడించారు.
Also Read : మిథున్ రెడ్డి లిక్కర్ కేసు మూలనపడినట్లేనా..?
దీనితో నిపుణులు మద్యపానానికి కొన్నాళ్లపాటు దూరంగా ఉండాలని.. కల్తీ మద్యం వ్యవహారంలో పూర్తి వివరాలు వెలుగు చూసే వరకు బార్లలో మద్యం సేవించవద్దని సూచిస్తున్నారు. అసలు పూర్తిగా మద్యపానానికి దూరంగా ఉండి ఈ వ్యవహారం తేలిన తర్వాత ఆలోచించుకోవాలని కోరుతున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కల్తీ మద్యం కారణంగానే అతను ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కల్తీ మద్యం కారణంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు సైతం ఉన్నాయి. పక్షవాతంతో పాటుగా క్యాన్సర్ వంటి అనారోగ్యాలు తలెత్తే అవకాశం ఉంది.