Wednesday, February 4, 2026 06:53 PM
Wednesday, February 4, 2026 06:53 PM

శానిటైజర్ పై యూరప్ సంచలన నిర్ణయం..?

ఈ రోజుల్లో క్యాన్సర్ పై అవగాహన అనేది చాలా అవసరం. మనం వాడే వస్తువులు, తినే ఆహార పదార్ధాలు, చర్మ సంబంధిత క్రీమ్స్ ఇలా ఎన్నో పదార్ధాలలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయనే హెచ్చరికలు చూస్తూనే ఉన్నాం. ఈ నేపధ్యంలో తాజాగా ఓ సంచలన నిర్ణయం దిశగా యూరోపియన్ యూనియన్ అడుగులు వేస్తోంది. ఇథనాల్ ను బ్యాన్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇథనాల్‌ ను క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే ప్రమాదకరమైన పదార్థంగా భావిస్తున్నారు. ఆస్పత్రులలో ఉపయోగించే హ్యాండ్ హ్యాండ్ శానిటైజర్లలో దీనిని ఎక్కువగా వాడుతూ ఉంటారు.

Also Read : చంద్రబాబు ధైర్యానికి ఫిదా.. బీసెంట్ రోడ్ పర్యటనపై ప్రసంశలు..!

అదే విధంగా డిటర్జెంట్‌ లలో కూడా దీని వాడకం ఎక్కువ. ఇది క్రమంగా ప్రమాదాలను పెంచే అవకాశం ఉందని హెచ్చరికలు వచ్చాయి. అక్టోబర్ 10న యూరోపియన్ కెమికల్స్ ఏజెన్సీ (ECHA) వర్కింగ్ గ్రూపులలో ఇథనాల్‌ ను విషపూరిత పదార్థంగా గుర్తించి, క్యాన్సర్, గర్భధారణ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుందని వెల్లడించింది. దానిని శుభ్రపరిచే ప్రదేశాలలో, ఇతర ఉత్పత్తులలో నిషేధించాలని చెప్తోంది. యూరోపియన్ కెమికల్స్ ఏజెన్సీ బయోసిడల్ ఉత్పత్తుల కమిటీ నవంబర్ 25 మరియు నవంబర్ 28 మధ్య సమావేశం కానుంది.

Also Read : కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

ఇథనాల్ క్యాన్సర్ కారకమని నిర్ధారించినట్లయితే, యూరోపియన్ కమిషన్ తీసుకున్న తుది నిర్ణయంతో దాని ప్రత్యామ్నాయాన్ని సిఫార్సు చేసే అవకాశం ఉంది. కరోనా సమయంలో దీనిని ఎక్కువగా వినియోగించారు. ఇథనాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లు అప్పట్లో చాలా అవసరం అయ్యాయి. వైరస్‌ లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలను చంపడంలో ఇథనాల్ ప్రభావవంతంగా ఉంటుంది. రోజు వారి ఉత్పత్తులలో కూడా వీటిని వినియోగించారు. దీనితో ఇథనాల్‌ ను పానీయంగా కాకుండా క్రిమిసంహారక మందుగా గుర్తించడమా..? లేదా నిషేధించడమా అనే అంశాలను పరిశీలిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్