వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం విషయంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. రెండు రోజుల క్రితం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలోని సిట్ బృందం ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఇందులో తాజాగా ఎక్సైజ్ శాఖ అధికారులను కూడా బృందంలో సభ్యులుగా చేరుస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు ఎక్సైజ్ శాఖ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వీరందరినీ వెంటనే రిలీవ్ చేసి విజయవాడ సి పి రాజశేఖర్ బాబుకు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Also Read: షర్మిలను దెబ్బ కొట్టడమే లక్ష్యమా…?
ఈ మేరకు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు. ఇక మద్యం కుంభకోణం పై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం… సిఐడి ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని.. ప్రతి 15 రోజులకు ఒకసారి నివేదికలను రూపొందించి సిఐడి చీఫ్ ద్వారా ప్రభుత్వానికి అందించాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎవరిని అయినా అరెస్టు చేసే అధికారం ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఉందంటూ వారికి పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసి అధికారాలను కట్టబెట్టింది కూటమి ప్రభుత్వం. తాజాగా మద్యం కుంభకోణం పై విచారించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా అవసరమవుతారని భావించి.. అధికారుల సహకారం తీసుకునేందుకు ఆ శాఖలో కొంతమంది అధికారులను ప్రత్యేక దర్యాప్తు బృందంలో చేర్చారు.
Also Read: ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యావు జగన్..?
విజయవాడ సి పి రాజశేఖర్ బాబు విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక సపోర్టింగ్ స్టాఫ్ లాగా వీరందరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఇప్పటికే రాజశేఖర్ బాబుతో పాటుగా ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలను కూడా నియమించారు. ఇప్పుడు తాజాగా వీరికి సహకరించేందుకు ఎక్సైజ్ సూపర్ ఇండెంట్ లను ఇన్స్పెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సంచలనమైంది.