Friday, September 12, 2025 09:02 PM
Friday, September 12, 2025 09:02 PM
roots

అలా మునిగిపోయిన లక్నో నావ

ఈ ఏడాది ఐపిఎల్ లో లక్నో జట్టు ప్రస్తానం ముగిసింది. జట్టు ఎంపిక విషయంలో ముందు చూపుతో వ్యవహరించినా ఆ తర్వాత ఆటగాళ్ళ పేలవ ప్రదర్శన జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపింది. ఇక జట్టు కీలక ఆటగాడు, కెప్టెన్ పంత్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. హిట్టర్ గా పేరున్న పంత్.. ఈ ఏడాది సీజన్ లో అంచనాలను ఏ మాత్రం అందుకోలేదు. ఇక జట్టు బౌలింగ్ విభాగం కూడా పెద్దగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. యువ ఆటగాళ్ళతో పాటుగా సీనియర్ ఆటగాళ్ళు సైతం ఆకట్టుకోలేదు.

Also Read : అక్కడికి రాహుల్ వచ్చేస్తున్నాడు..? బెర్త్ ఖరారు

ఇదిలా ఉంచితే రిటైన్ సిస్టం జట్టుకు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. నికోలస్ పూరన్ (రూ. 21 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ. 11 కోట్లు), మయాంక్ యాదవ్ (రూ. 11 కోట్లు), మొహ్సిన్ ఖాన్ (రూ. 4 కోట్లు), మరియు ఆయుష్ బదోని (రూ. 4 కోట్లు) లకు రిటైన్ చేసుకుంది. మయాంక్ కేవలం 2-3 మ్యాచ్ లు ఆడగా, మొహ్సిన్ ఈ ఏడాది ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. కీలక ఆటగాళ్ళు గాయపడటం కూడా జట్టు విజయంపై ప్రభావం పడింది అనే చెప్పాలి. ఇక పంత్ ఈ సీజన్ లో టీంకు మైనస్ అయ్యాడు.

Also Read : సాయి సుదర్శన్ స్పాట్ ఫిక్స్..?

గత సీజన్లలో పంత్ ఆకట్టుకున్నా.. ఈసారి అతనిపై ఉన్న భారీ అంచనాలను అందుకోలేదు అనే చెప్పాలి. 27 కోట్లకు అతనిని కొనుగోలు చేసింది లక్నో. కెఎల్ రాహుల్ జట్టు నుంచి తప్పుకోగా.. ఆ తర్వాత మెగా వేలంలో పంత్ ను కొనుగోలు చేసింది లక్నో. దీనితో పంత్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. జాతీయ మీడియా కూడా పంత్ ను టార్గెట్ చేసి కథనాలు రాస్తోంది. త్వరలో ఇంగ్లాండ్ పర్యటన ఉన్న నేపధ్యంలో పంత్ ఎంత వరకు ఆకట్టుకుంటాడు అనేది చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్