Friday, September 12, 2025 11:20 PM
Friday, September 12, 2025 11:20 PM
roots

ఏసీబీ కంటే ముందే.. కేటిఆర్ కు ఈడీ షాక్

తెలంగాణలో సంచలన రేపుతున్న ఫార్ములా ఈ రేసింగ్ విషయంలో ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచుతున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే కేసు కూడా నమోదు చేసింది. తెలంగాణ ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసు వివరాలను తీసుకున్న ఈ డి విచారణను వేగవంతం చేస్తోంది. ఈ కేసులో ముందు సాక్షులను విచారించాలని ఈడీ అధికారులు భావించినా ఆ తర్వాత కేటీఆర్ సహా ఇతర నిందితుల నుంచే విచారణ మొదలు పెట్టాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

Also Read : ఆర్బిఐ గవర్నర్ టూ ప్రధాని.. అవినీతి మరకలేని నేత…!

ఫార్ములా రేసింగ్ కేసులో కేటీఆర్ కు ఈ డి తాజాగా నోటీసులు పంపించింది. జనవరి 7న కేటీఆర్ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. కేటీఆర్ తో పాటుగా మరో ఇద్దరు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు పంపించింది. జనవరి 2, 3 తేదీల్లో వాళ్ళిద్దరు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారంలో ఫిర్యాదు చేసిన దాన కిషోర్ స్టేట్మెంట్ కూడా నమోదు చేసేందుకు పిడి అధికారులు సిద్ధమయ్యారు.

Also Read : మంగళానికి జనసేన జై

ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా ఈ వ్యవహారానికి సంబంధించి మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది కాబట్టి ఏసీబీ విచారణ ఎంతవరకు కొనసాగుతుందనేది చెప్పలేని పరిస్థితి. ఈ వ్యవహారానికి సంబంధించి సిబిఐ అధికారులు కూడా ఈ డి తో సంప్రదింపులు జరుపుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్