హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.. ఆటకంటే పంచాయితీలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటుంది. ఆటగాళ్ళ గొడవలు, అసోసియేషన్ గొడవలు ఇలా ఒకటి రెండు కాదు.. ఎన్నో గొడవలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. హైదరాబాద్ లో క్రికెట్ ను బలోపేతం చేయడంపై మాత్రం అసోసియేషన్ దృష్టి సారించే ప్రయత్నం చేయడం లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో బీసీసిఐ ని అడ్డం పెట్టుకుని అన్ని అసోసియేషన్ లు తమ తమ రాష్ట్రాల్లో బలోపేతం చేసుకుంటే హైదరాబాద్ పరిస్థితి డిఫరెంట్ గా ఉంటుంది.
Also Read : గిల్ టెక్నిక్ డెవెలప్ కావాల్సిందేనా..? మాజీ కెప్టెన్ హాట్ కామెంట్స్
అజారుద్దీన్, శివలాల్ యాదవ్, ఇప్పుడు జగన్మోహన్ రావు ఇలా ప్రతీ ఒక్కరు వివాదాలతోనే నడుస్తున్నారు. చివరకు ఐపిఎల్ జట్లను కూడా ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు సైతం వస్తున్నాయి. ఈ ఏడాది ఐపిఎల్ సీజన్ లో.. టికెట్ల వ్యవహారం హెచ్ సియె పరువు తీసిన మాట వాస్తవం. అందుకే హైదరాబాద్ జట్టు చెన్నై వెళ్తామని వార్నింగ్ ఇచ్చింది. హెచ్సియే అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నట్టే కనపడుతోంది.
తాజాగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. స్టేడియ టెండర్ల నుంచి టికెట్ల విక్రయం వరకు అవకతవకలకు పాల్పడ్డారని గుర్తించారు. పదేళ్లలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ నుంచి అసోసియేషన్ కు రూ.800 కోట్లకు పైగా నిధులు వచ్చాయి. అసోసియేషన్ అకౌంట్‌ను సొంత ప్రయోజనాలకు వాడారని ఆరోపణలు వినపడుతున్నాయి. బాల్స్,స్టేడియం చైర్స్,జిమ్ పరికరాల టెండర్లలో.. అక్రమాలకు పాల్పడినట్టు సమాచారం.
Also Read : నాయర్ సెకండ్ ఛాన్స్ అయిపోయిందా..?
అవినీతి జరిగినట్టు ఫోరెన్సిక్ ఆడిట్‌లో నిర్ధారణ అయింది. అసోసియేషన్ లోకి ఎంట్రీ కావడానికి.. జగన్మోహన్ రావు జగన్ ఎవరెవరికీ ఎంత ఇచ్చారో అనే అంశంపై ఈడీ ఆరా తీస్తుంది. ఐపీఎల్ మ్యాచ్‌ల టెండర్ల విషయంలోనూ.. సొంతవాళ్లకే లాభం చేశారని ఆయనపై ఆరోపణలు వినపడుతున్నాయి. ఫుడ్ క్యాటరింగ్,స్టాల్స్,టికెట్స్ కేటాయింపులో.. తన వారికే టెండర్లు కేటాయించడంపై ఈడీ ఆరా తీస్తోంది.