Friday, September 12, 2025 08:54 PM
Friday, September 12, 2025 08:54 PM
roots

ఊగిపోయిన తెలుగు రాష్ట్రాలు… 1969 తర్వాత భారీ భూకంపం

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ప్రజలను వణికించాయి. ఉదయం 7 గంటల 27 నిమిషాల ప్రాంతంలో వచ్చిన ఈ భూకంపం తీవ్రతకు ప్రజలు భయపడిపోయారు. ములుగు జిల్లాలో ఉన్న ఈ భూకంప కేంద్రం… భూమికి 40 కిలోమీటర్ల లోతులో ఉందని గుర్తించారు. 1993 తర్వాత ఇదే అతిపెద్ద భూకంపం అని… మన దేశంలో సంభవించిన భూకంపాల్లో ఇది మూడో అతి పెద్దది అంటూ అధికారులు వెల్లడించారు. ములుగు వద్ద 5.3 గా రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత నమోదు అయింది. ఆ ప్రభావం గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కనిపించింది.

Also Read : ప్లీజన్నా రండి.. పార్టీ నేతలకు జగన్ రిక్వెస్ట్

భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 1969 లో ఇదే ప్రాంతంలో 5.6గా భూకంప తీవ్రత నమోదు అయింది అని అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం నుంచి 225 కోలోమీటర్ల పరిధిలో భూకంపం సంభవించింది. తెలంగాణాలోని ములుగు, ఏటూరు నాగారం, ఖమ్మం, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, పెద్దపల్లి, గోదావరిఖని, మంథని, సత్తుపల్లి, పెనుబల్లి ప్రాంతాల్లో ఈ భూకంపం సంభవించింది. 2 నుంచి 5 సెకన్ల పాటు ఈ భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు.

Also Read : చంద్రబాబు అడ్రస్ మారుతోంది 

దీనికి సంబంధించిన అనేక దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇళ్ళల్లోని ఫ్యాన్ లు, కుర్చీలు ఊగిపోవడం ప్రజలు గమనించారు. గోదావరి పరివాహక ప్రాంతంలోనే ఈ తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. మరో వారం రోజుల పాటు ఆఫ్టర్ షాక్స్ ఉంటాయని… ఇళ్ళు కట్టుకునే వారు భవిష్యత్తులో ఇటువంటి వాటిని తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మేడారం ఆలయంలో నమోదు అయిన సీసీ ఫూటేజ్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ ప్రాంతంలోనే భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని గుర్తించారు. ఏపీ సరిహద్దు రాష్ట్రాలు అయిన ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కూడా భూకంపం సంభవించింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్