డ్రీమ్ 11 సంస్థ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఈ షాక్ ఎలా ఉందంటే.. ఉద్యోగులే కాదు.. బడా కార్పొరేట్ సంస్థలు సైతం ఆశ్చర్యపోయేలా ఉంది. గేమింగ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం రియల్ మనీ గేమింగ్ బిల్లు తీసుకువచ్చింది. దీని కారణంగా గేమింగ్ యాప్‌పై నిషేధం వేటు పడింది. దీంతో డ్రీమ్ 11తో పాటు పలు గేమింగ్ సంస్థల ఆదాయం పూర్తిగా పడిపోయింది. లాభాలు కూడా వందకు వంద శాతం కోల్పోయాయి.
Also Read : ముంతాజ్ హోటల్ కు టిటిడి భూమి.. బీఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు
సాధారణంగా ఒక సంస్థ నష్టాల్లో ఉన్నా… ఆదాయ పడిపోయినా, వ్యయం తగ్గించుకోవాలని భావించినా సరే.. ముందుగా ఆలోచించేది ఉద్యోగుల తొలగింపు. బడా కార్పొరేట్ సంస్థలు కూడా ఇప్పుడు లే ఆఫ్ ప్రకటిస్తున్నారు. వేల మంది ఉద్యోగులను రకరకాల కారణాలతో తొలగిస్తున్నాయి. ఇటీవల టీసీఎస్ సంస్థ 12 వేల మంది ఉద్యోగులపై వేటు వేసింది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కూడా భారీగానే లే ఆఫ్ ప్రకటిస్తున్నాయి. అయితే డ్రీమ్ 11 మాత్రం వీటికి భిన్నంగా వ్యవహరిస్తోంది.
కేంద్రం తీసుకువచ్చిన బిల్లు కారణంగా డ్రీమ్ 11 ఆదాయం వంద శాతం పడిపోయింది. గ్రూప్ రెవెన్యూ కూడా 95 మేర కోల్పోయినట్లు సంస్థ సీఈవో హర్ష జైన్ వెల్లడించారు. అందుకే బీసీసీఐతో స్పాన్సర్ షిప్ కాంట్రాక్ట్ కూడా రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఇదే సమయంలో హర్ష జైన్ ఉద్యోగుల తొలగింపుపై హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఏ ఒక్కరినీ తొలగించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఇతర మార్గాల్లో ఆదాయం తెచ్చుకునేందుకు మార్గాలు అన్వేషిస్తున్నట్లు హర్ష ప్రకటించారు.
Also Read : సహారా టూ డ్రీం 11.. టీం ఇండియా స్పాన్సర్లను వెంటాడుతున్న కష్టాలు
గత ఆర్థిక ఏడాదిలో డ్రీమ్ 11 ఆదాయం రూ.6,384 కోట్లు. అంతకు ముందు ఏడాది రూ.3,481 కోట్లు. గతేడాది రెట్టింపు ఆదాయం ఆర్జించిన డ్రీమ్ 11.. తాజా సంక్షోభం కారణంగా పూర్తిగా ఆదాయం కోల్పోయిందనే చెప్పాలి. అయితే ఏ మాత్రం సంస్థను మూసి వేయకుండా.. డ్రీమ్ 11 3.0 దిశగా అడుగులు వేస్తున్నట్లు హర్ష జైన్ వెల్లడించారు. డ్రీమ్ స్పోర్ట్స్ ఫ్యాన్ కోడ్, డ్రీమ్ గేమ్ స్టూడియోస్, డ్రీమ్ సెట్ గో, ఫైనాన్స్, డ్రీమ్ మనీ వెంచర్‌తో సహా ఇతర వ్యాపారాల్లో 500 మంది ఇంజనీర్లను నియమించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త ఆలోచనతో ముందుకు వెళ్తున్న డ్రీమ్ 11.. ఉద్యోగాలపై ఎలాంటి వేయటం లేదని హర్ష జైన్ తెలిపారు. ప్రస్తుతం డ్రీమ్ 11 సంస్థలో 2 వేల మంది వరకు ఉద్యోగులున్నారు. త్వరలోనే కొత్త వ్యాపారంతో మార్కెట్‌లోకి వస్తామన్న సీఈఓ హర్ష ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.