Monday, October 27, 2025 10:46 PM
Monday, October 27, 2025 10:46 PM
roots

మరో బాంబు పేల్చిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఎన్నో ఆశలతో అమెరికా గడ్డపై అడుగుపెట్టిన విద్యార్థులు, ఐటీ ఉద్యోగులతో పాటుగా పలు రంగాలు ఇప్పుడు భయపడిపోతున్నాయి. ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అర్థం కాక చాలామంది ఆ దేశాన్ని వదిలేయడమే మంచిది అనే అభిప్రాయానికి కూడా వస్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ఇప్పుడు ఆ మాటలు నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read : అమెరికా ఎన్నికలపై ట్రంప్ సంచలన నిర్ణయం

అమెరికన్లకు ఉద్యోగ వ్యాపార రంగాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ట్రంప్ నిర్ణయాలపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఇటీవల పలు యూనివర్సిటీలో ఆందోళనలో విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా పార్ట్ టైం ఉద్యోగాల విషయంలో ట్రంప్ నిర్ణయాలు మార్చుకోవాలని కోరుతూ పలువురు విద్యార్థులు నిరసనలకు దిగారు. ఇందులో భారతీయ విద్యార్థులు కూడా ఎక్కువగానే ఉన్నారు. లక్షల ఖర్చుపెట్టి అమెరికా వెళ్లిన తర్వాత ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవడంతో ఆందోళన ద్వారా ప్రభుత్వాన్ని దారిలోకి తెచ్చుకోవచ్చు అనే అభిప్రాయంతో నిరసనలకు దిగారు.

Also Read : భారత్ పై మయన్మార్ భూకంప ప్రభావం

అయితే ఈ ప్లాన్ బెడిసి కొట్టే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇటీవల యూనివర్సిటీలో జరిగిన నిరసనలకు నాయకత్వం వహించిన విద్యార్థులకు వీసాలు రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అలాగే జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన విద్యార్థుల వీసా లు కూడా రద్దు చేస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. అలాగే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విద్యార్థులకు కూడా వార్నింగులు వెళ్లాయి. ఇందులో భారతీయ విద్యార్థులు కూడా ఎక్కువగానే ఉన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్