Wednesday, October 22, 2025 04:03 AM
Wednesday, October 22, 2025 04:03 AM
roots

మోడీకి ట్రంప్ ఫోన్.. తప్పు దిద్దుకుంటున్న పెద్దన్న..?

గత కొన్నాళ్ళుగా తన చేష్టలతో ప్రపంచ దేశాలను ఇబ్బంది పెడుతోన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైఖరిలో క్రమంగా మార్పు కనపడుతోంది. బ్రిక్స్ దేశాల సంఖ్య పెరగడం, డాలర్ ఆధిపత్యానికి దెబ్బ పడే సంకేతాలు కనపడటం, అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దేశాలలో ఉన్న కార్పోరేట్ సంస్థలు ముందుకు రాకపోవడం వంటివి ట్రంప్ సర్కార్ ను కలవరపెడుతున్నాయి. దానికి తోడు భారత్, చైనా, రష్యా దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేయడం కూడా ట్రంప్ ను ఇబ్బంది పెడుతోంది.

Also Read : టీం ఇండియా కొత్త స్పాన్సర్ ఎవరంటే..?

ఈ తరుణంలో తన దూకుడు తగ్గించి సామరస్యానికి ట్రంప్ సిద్దమయ్యారు. భారత్ కు అమెరికా ప్రతినిధులు విచ్చేసి, వాణిజ్య చర్చలు ఆరవ రౌండ్ మొదలుపెట్టిన రోజునే కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా ట్రంప్ ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించడానికి, అమెరికా తీసుకుంటున్న చర్యలపై ప్రధాని మోడీ తన మద్దతు తెలిపారు.

Also Read : దారిలోకి వచ్చిన ట్రంప్.. భారత్ కు అమెరికా ప్రతినిధులు..!

భారత్, అమెరికా మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు ట్రంప్ ముందుకు రావడాన్ని కూడా మోడీ కొనియాడారు. ట్రంప్ కూడా దీనిపై తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. తన స్నేహితుడు, ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్ లో మాట్లాడి శుభాకాంక్షలు చెప్పినట్టు కామెంట్ చేసారు. రష్యా, ఉక్రెయిన్ యుద్దాన్ని ముగించడంలో ట్రంప్ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఇప్పుడు ఈ ఫోన్ కాల్ హాట్ టాపిక్ గా మారింది. కాగా భారత్ పై ట్రంప్ రెండు దఫాలుగా 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఆ పదవులు ఎప్పుడు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే...

వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర...

ఉప్పు, పప్పు కూడా...

ఇద్దరు అధికారులు తన్నుకుంటే.. అది ఏమవుతుందో...

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

పోల్స్