భారత్ – పాకిస్తాన్ విషయంలో అవకాశం దొరికిన ప్రతీసారి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్న మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, ఆపరేషన్ సిందూర్ వ్యవహారం, కాల్పుల విరమణ ఒప్పందం.. ఇవన్నీ ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ ప్రచారానికి వాడుకోవడం భారత్ కు తలనొప్పిగా మారింది. పదే పదే ఈ రెండు దేశాలను బెదిరించాను అంటూ ట్రంప్ మాట్లాడటంపై విమర్శలు వస్తున్నా.. ఆయన మాత్రం వెనక్కు తగ్గడం లేదు.
Also Read : డిజిటల్ బుక్ లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేరు
పొరుగు దేశాలైన భారత్ – పాకిస్తాన్ మధ్య వాణిజ్య బెదిరింపులను ఉపయోగించి శాంతి ఒప్పందాన్ని కుదిర్చినట్టు మరోసారి కామెంట్ చేసారు. రెండు దేశాలు తన మాట వినడానికి సుంకాల పేరుతో బెదిరించా అంటూ కామెంట్ చేసారు. ఈ పరిణామం అమెరికాకు వందల బిలియన్ డాలర్ల ఆదాయం తెచ్చి పెడుతోంది అన్నారు. తనకు సుంకాల విషయంలో అధికారం లేకపోతే.. ఏడు యుద్దాలలో కనీసం నాలుగు యుద్దాలు జరిగేవి అంటూ కామెంట్ చేసారు. తాను పరిరక్షకుడిని అంటూ తన గురించి తాను గొప్పలు చెప్పుకున్నారు ట్రంప్.
Also Read : రంగంలోకి జగన్.. క్యాడర్ తో మరో కీలక సమావేశం
ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా తాను ప్రధాని నరేంద్ర మోడీని బెదిరించాను అని, యుద్ధం ఇలాగే కొనసాగితే.. మీతో వ్యాపారాలు చేసేది లేదని హెచ్చరించాను అని ట్రంప్ వ్యాఖ్యానించారు. సుంకాలు ఎక్కువ విధిస్తామని మోడీ వార్నింగ్ ఇచ్చా అంటూ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ పై భారత్ పలుమార్లు ఖండించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ మొదట్లో ఈ వాదనను తిరస్కరించినప్పటికీ, తరువాత దానిని అంగీకరించింది. ఆ తర్వాత పాకిస్తాన్.. ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది.