Wednesday, October 22, 2025 04:31 AM
Wednesday, October 22, 2025 04:31 AM
roots

భారత్ కు ట్రంప్ దెబ్బ.. టారిఫ్ లతో కొత్త షాక్..?

ప్రపంచ దేశాలను సుంకాల పేరుతో వణికిస్తున్న అమెరికా అధ్యక్షుడు భారత్ ను కూడా ఈ విషయంలో ఇబ్బంది పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. రష్యాతో స్నేహం చేసే దేశాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ సర్కార్.. ఇప్పుడు భారత్ పై కూడా సుంకాలను విధించాలని భావిస్తున్నట్టు జాతీయ మీడియా వెల్లడించింది. మన దేశానికి కూడా 20% నుండి 25% వరకు సుంకం రేటు విధించే అవకాశం ఉందని, అమెరికా ప్రభుత్వ వర్గాలు తెలిపినట్టు జాతీయ మీడియా పేర్కొంది.

Also Read : యాషెస్ లో చుక్కలు చూపిస్తాం.. ఇంగ్లాండ్ కు ఆసిస్ స్ట్రాంగ్ వార్నింగ్

ఆగస్ట్ 1 నుంచి ఇవి అమలులోకి వచ్చే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. భారత్ కు అంత మొత్తంలో సుంకం విధించడం సాధ్యమేనా అనే విలేకర్ల ప్రశ్నకు.. ట్రంప్ సాధ్యమే అన్నట్టు సమాధానం ఇచ్చారు. భారత్ తమకు మంచి మిత్ర దేశమన్న ట్రంప్.. భారత్ ఇతర దేశాల కంటే ఎక్కువ సుంకాలు విధించిన విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ఐదు రోజుల స్కాట్లాండ్ పర్యటన అనంతరం అమెరికాకు తిరిగి వస్తున్న సమయంలో ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది.

Also Read : జగనన్నా.. మాకు ఈ రెడ్డి గారు వద్దన్నా ప్లీజ్..!

గత వారం, జూలై 23న, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు పరస్పర సుంకాల రేట్లను నిర్ణయిస్తున్న తన ప్రభుత్వం.. 15% కంటే తక్కువగా సుంకాలు ఏ దేశానికి ఉండవని స్పష్టం చేసారు. ఇక భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలోనే జరిగే అవకాశం ఉంది. సుంకాలు విధించడానికి ఆగస్టు 1 గడువు సమీపిస్తున్న తరుణంలో, రెండు దేశాల అధికారులు నిరంతరం చర్చిస్తున్నారు. ఇటీవల యూకేతో వాణిజ్య ఒప్పందం చేసుకున్న భారత్, అమెరికాతో కూడా చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తోంది. అయితే భారత్ తో చర్చలకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఆ పదవులు ఎప్పుడు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే...

వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర...

ఉప్పు, పప్పు కూడా...

ఇద్దరు అధికారులు తన్నుకుంటే.. అది ఏమవుతుందో...

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

పోల్స్