Friday, August 29, 2025 09:32 PM
Friday, August 29, 2025 09:32 PM
roots

ఉక్రెయిన్ పై మోడీ యుద్ధం.. అమెరికా సంచలన కామెంట్స్

ఏళ్ళ తరబడి సాగుతోన్న ఉక్రెయిన్ – రష్యా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. రెండు దేశాలు కాల్పుల విరమణకు సిద్దంగా ఉన్నామని ప్రకటనలు చేసినా సరే మధ్యవర్తిత్వం మాత్రం సరిగా జరగని పరిస్థితి. ఉక్రెయిన్ విషయంలో రష్యాపై ఒత్తిడి పెంచాలని అమెరికా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో భారత్ పై కూడా ఒత్తిడి చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా దీనిపై డోనాల్డ్ ట్రంప్ సలహాదారు పీటర్ నవారో సంచలన కామెంట్స్ చేసారు. ఉక్రెయిన్ లో కొనసాగుతున్న యుద్ధం మోడీ చేస్తున్నారని మండిపడ్డారు.

భారత్ రాయితీ చమురు కొనుగోళ్ల ద్వారా రష్యా యుద్ధానికి ఆజ్యం పోస్తోందని ఆరోపించారు. బ్లూమ్‌బెర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్స్ చేసారు. రష్యా చమురు కొనుగోలును ఆపివేస్తే భారత్ వెంటనే అమెరికా విధించే సుంకాలలో 25% తగ్గింపును పొందుతుందని స్పష్టం చేసారు. ఉక్రెయిన్‌లో శాంతికి మార్గం కొంతవరకు న్యూఢిల్లీ ద్వారానే సాధ్యమన్నారు. మోడీ అనుకుంటే ఈ యుద్ధం ఆగుతుందని పేర్కొన్నారు. భారత్ పై మరిన్ని సుంకాలు విధించడానికి అమెరికా సిద్దంగా ఉందన్నారు.

భారత వస్తువులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50% సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నవారో ఈ వ్యాఖ్యలు చేసారు. ప్రజాస్వామ్య దేశాలతో కలిసి పని చేయాల్సిన మోడీ.. నియంతలతో కలిసి ముందుకు వెళ్తున్నారని మండిపడ్డారు. ఇది తనకు చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. మోడీ చాలా గొప్ప నాయకుడు అని, భారత్ ఎంతో పరిణితి చెందిన ప్రజాస్వామ్యం అన్నారు. మనం ఎవరి నుంచి అయినా చమురు కొనుగోలు చేయవచ్చనే గర్వం భారతీయుల్లో ఉందని విమర్శించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. కానీ.....

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో...

ఇదేం ప్యాలెస్.. రిషికొండ...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన...

ఏ క్షణమైనా పిన్నెల్లి...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్ల...

మరో అవకాశం ఇచ్చినట్లేనా..?

పావలా కోడికి ముప్పావల మసాలా.. అనేది...

అమరావతికి కేంద్రం గుడ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్...

బండి సంజయ్ కు...

తెలంగాణా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి....

పోల్స్