Friday, September 12, 2025 03:21 PM
Friday, September 12, 2025 03:21 PM
roots

అవును.. ఆ ఇద్దరికి వాళ్లే సమస్య..!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒకటే విషయంపై చర్చ నడుస్తోంది. నిన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో చక్రం తిప్పిన రెండు రాజకీయ కుటుంబాల్లో ఇప్పుడు ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. చివరికి రాజకీయ ఎదుగుదలకు అడ్డుపడుతున్నారంటూ ప్రత్యేక పార్టీలు స్థాపించే స్థాయికి చేరుకుంది. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో ఎక్కడ చూసినా సరే ఇదే హాట్ టాపిక్‌. వీటిల్లో ఒకటి వైఎస్ కుటుంబం అయితే.. రెండోది కల్వకుంట్ల ఫ్యామిలీ. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న కుటుంబాలు. రెండు ఫ్యామిలీల్లో మాజీ ముఖ్యమంత్రులున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరి అసలైన వారసులు ఎవరూ అనే విషయంపై సిగపట్లు పట్టుకుంటున్నారు.

Also Read : పొత్తుపై కీలక వ్యాఖ్యలు.. వారికి మాస్ వార్నింగ్..!

తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబంలో ఇప్పుడు అన్నా చెల్లెళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. భారతీయ రాష్ట్ర సమితి ఫ్యూచర్ లీడర్ అంటూ కల్వకుంట్ల తారక రామారావు పేరు బాగా వినిపిస్తోంది. దీని విషయంపై సొంత చెల్లెలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. ఇప్పుడు ఇదే లేఖ పార్టీలో గ్రూపు రాజకీయాలను బయటపెట్టింది. వాస్తవానికి తొలి నుంచి పార్టీ అధ్యక్ష కుర్చీ కోసం కుమ్ములాటలు జరుగుతున్నాయి. కేసీఆర్ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టే నేత ఎవరూ అనే విషయంపై కేసీఆర్ కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు మధ్య విబేధాలున్నాయి. పైకి ఇద్దరు నేతలు కలిసే తిరుగుతున్నప్పటికీ.. తెర వెనుక మాత్రం ఎవరి ప్రయత్నాలు వారివే. అయితే పార్టీలో ఫ్యూచర్ లీడర్ ఎవరూ అనే విషయంపై మాత్రం.. అధినేత నిర్ణయమే ఫైనల్ అని బయటకు చెబుతున్నారు. కేటీఆర్ సారధ్యంలో నడిచేందుకు తాను సిద్ధమే అని హరీశ్ రావు కూడా ఎన్నో సందర్భాల్లో వ్యాఖ్యానించారు.

Also Read : పాకిస్తాన్ బహిరంగ సభలో పహల్గాం ఉగ్రవాది సంచలన కామెంట్స్

అయితే తన అరెస్టు తర్వాత పార్టీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయనేది ప్రస్తుతం కేసీఆర్ కుమార్తె కవిత చేస్తున్న ఆరోపణ. ఎన్నికల్లో పార్టీ ఓటమికి, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తన ఓటమికి కొందరే కారణమని పరోక్షంగా తన అన్న గురించే ప్రస్తావించారు. అలాగే పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అదే సమయంలో తనపై వచ్చిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. తాను జైలులో ఉన్నప్పుడు పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నడిపించేంత పెద్దవాళ్లు ఎవరూ లేరని.. తన జోలికి వస్తే బాగోదంటూ కవిత మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Also Read : వాడు చేసేది చిచోరా రాజకీయం.. అన్న పై కవిత తిరుగుబాటు

సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే తరహా పరిస్థితి మరో మాజీ సీఎం వైఎస్ కుటుంబంలో తలెత్తింది. 2009 వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వైసీపీ ప్రారంభం, 2012లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరెస్టు తర్వాత జగన్ సోదరి షర్మిల పార్టీ కోసం, అన్న కోసం పాదయాత్ర చేశారు. ఎన్నికల్లో ప్రచారం చేశారు. పార్టీ గెలుపు కోసం అహోరాత్రులు పని చేశారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి మారిపోయింది. వైఎస్ షర్మిలను పూర్తిగా పక్కన పెట్టారు. కనీసం పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనకుండా దూరం పెట్టారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన షర్మిల.. సైలెంట్‌గా హైదరాబాద్‌ వెళ్లిపోయారు. తెలంగాణలో వైఎస్ఆర్‌టీపీ ప్రారంభించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి.. ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టి.. సొంత అన్న జగన్‌పైనే యుద్ధం ప్రకటించారు. వైసీపీ ఓటమి కోసం తనవంతు ప్రయత్నం చేశారు.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే టాపిక్‌ మీద చర్చ నడుస్తోంది. అప్పుడు షర్మిల, ఇప్పుడు కవిత.. అనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ ఇద్దరు అన్నల చేతుల్లోనే మోసపోయారని.. ఈ ఇద్దరు ఆధిపత్య పోరులో ఓడిపోయారని.. ఈ ఇద్దరినీ ఆస్తి కోసమే అన్నలు తరిమేశారని.. ఈ ఇద్దరికి ప్రజాభిమానం ఉందంటున్నారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఈ ఇద్దరి భర్తల పేర్లు కూడా అనిల్ కావడం యాధృచ్ఛికం. దీంతో కవిత పార్టీ ప్రారంభిస్తారా.. లేక షర్మిల మాదిరిగా కాంగ్రెస్ పార్టీలో చేరతారా అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్