ఐ బొమ్మ వెబ్ సైట్ ద్వారా సినిమా పరిశ్రమకు చుక్కలు చూపించిన ఇమ్మడి రవి విచారణ కొనసాగుతోంది. అతనిపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఒక్కో కేసులో విడిగా కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. సైబర్ క్రైమ్ నేరాలపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. క్రికెట్ బెట్టింగ్ యాప్స్ తో పాటుగా.. డిజిటల్ అరెస్ట్ వంటి అంశాల్లో కూడా అతను కీలకంగా వ్యవహరించినట్లు భావిస్తున్న పోలీసులు ఆ దిశగా కూడా విచారణ జరుపుతున్నారు. భారత్ లో ఎక్కడైనా ఆస్తులు కొన్నాడా అనే అంశంపై కూడా పోలీసులు ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read : అమెరికా ఫ్లైట్ ఎక్కేస్తున్న విడుదల రజనీ..?
ఇప్పటివరకు అతని వద్ద దొరికిన హార్డ్ డిస్క్ లు, వెబ్ సైట్ లో ఉన్న సినిమాలు మొత్తం కలిపి 21 వేల వరకు ఉన్నట్లు తేల్చారు. అయితే సినిమా పరిశ్రమకు చెందిన కొంతమంది వ్యక్తులు అతనికి సహకరించినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. దీనిపై ముందు నుంచి సినిమా వర్గాల్లో కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఓటీటీలకు సినిమాల మీద కొంతమంది నిర్మాతలు.. అతనికి కూడా విక్రయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్ని సినిమాల క్వాలిటీ చూస్తే ఖచ్చితంగా ఒరిజినల్ సినిమాలనే అందులో అప్లోడ్ చేసినట్లు అనుమానిస్తున్నారు.
Also Read : టెలికం కీలక నిర్ణయం.. ఇక వారికి చెక్..!
సినిమా హాల్లో ఆడని సినిమాలను.. ఓటీటీ లు కూడా తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ ఉంటాయి. దీంతో తమ నష్టాలను భర్తీ చేసుకోవడానికి అతనికి కూడా సినిమాలను అమ్మి ఉండవచ్చని భావిస్తున్నారు. దీంతో వెబ్సైట్ లో అప్లోడ్ అయిన సినిమాలలో ఫ్లాప్ అయినవి ఎన్ని ఉన్నాయి అనేదానిపై ఆరా తీయటం మొదలుపెట్టారు. అలాగే అతని ఫోన్లు, ఈమెయిల్ అకౌంట్ లు, ల్యాప్ టాప్ లలో ఉన్న వివరాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే హైదరాబాదులో అతని టీం ఎవరున్నారు అనే అంశాలపై కూడా దృష్టి పెట్టారు పోలీసులు. దీంతో సినిమా నిర్మాతలపై కూడా గురిపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

