Monday, October 27, 2025 07:39 PM
Monday, October 27, 2025 07:39 PM
roots

బీజేపీతో డీల్ సెట్ చేసుకున్న సాయిరెడ్డి

ఏదేమైనా రాజకీయాల్లో కొంతమంది పరిస్థితి ఎలా ఉన్నా తమకు అనుకూలంగా మార్చడంలో నిష్ణాతులై ఉంటారు. అందులో మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ముందు వరసలో ఉంటారు. ఏపీలో 2019లో వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత వైసీపీలో క్రమంగా ప్రభావం కోల్పోయిన విజయసాయిరెడ్డి.. 2024 లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత మనసు విరిగి రాజకీయాల నుంచి తప్పకున్నారు. తప్పుకున్న తర్వాత పరోక్షంగా అలాగే ప్రత్యక్షంగా వైఎస్ జగన్ పై చేసిన వ్యాఖ్యలు కాస్త బోనస్.

Also Read : పెద్ద ప్లాన్ తోనే గోరంట్ల మాధవ్..!

తాను తిరిగి రాజకీయాల్లోకి అడుగుపెట్టే సమస్య లేదని స్పష్టంగా చెప్పిన విజయసాయిరెడ్డి వ్యవసాయం చేసుకుంటాను అంటూ కూడా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అక్కడి వరకు బాగానే ఉంది గాని ఇప్పుడు మళ్ళీ ఆయన బిజెపిలో చేరతారు అనే ప్రచారం హాట్ హాట్ గా నడుస్తోంది. బిజెపి నుంచి ఆయనను రాజ్యసభకు పంపించేందుకు ఆ పార్టీ పెద్దలు సానుకూలంగా ఉన్నారు అనేది రాజకీయ వర్గాల మాట. ఆర్థికంగా బలమైన నేతగా గుర్తింపు ఉన్న విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ బిజెపిని ఆర్థికంగా ఆదుకుంటానని చెప్పినట్లు సమాచారం.

Also Read : కసిరెడ్డిని దేశం దాటించిన ఐపిఎస్

దీనితో బీజేపీ పెద్దలు ఆయనను రాజ్యసభకు పంపించేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. ఆయన కారణంగా ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి త్వరలో ఉపఎన్నిక జరగనుంది. కాబట్టి అదే స్థానం నుంచి మళ్లీ బిజెపి తరఫున రాజ్యసభలో పెట్టేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనికి బిజెపి పెద్దలు కూడా ఇప్పటికే అంగీకారం తెలిపారు అనేది ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. జగన్ వ్యక్తిగత రాజకీయ జీవితంపై ఎక్కువగా ప్రభావం చూపించే విజయసాయిరెడ్డి బిజెపిలో చేరిన తర్వాత ఆయనను ఎలా కాపాడుతారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్