ఏ దేశంలో చట్టాలు ఎలా ఉన్నా.. మన దేశంలో మాత్రం నేరాలు చేసిన వారు తప్పించుకోవడం చాలా ఈజీ అనే భావన చాలా మందిలో వినపడుతూ ఉంటుంది. రాజ్యాంగం బలంగా ఉన్నా సరే.. కొందరు నేరస్తులు, నేరాల ఆరోపణలు ఉన్న వారు ఏదోక లోసుగుతో దేశం దాటేస్తూ ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కాంలో కీలకంగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దేశం దాటేసినట్టు తెలుస్తోంది. ఆయనను కొందరు ప్రముఖులు కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనే భావన వ్యక్తమవుతోంది.
Also Read : సజ్జలకు జగన్ బిగ్ షాక్.. మరో రెడ్డికి అగ్ర తాంబూలం
తాజాగా కసిరెడ్డి సిఐడీ విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇది మూడవ సారి కాగా ఆయన మూడు సార్లు.. విచారణకు హాజరు కాలేదు. కనీసం తాను విచారణకు రావడం లేదనే విషయాన్ని కూడా కసిరెడ్డి సమాచారం ఇవ్వలేదు. ఇక ఎక్సైజ్ కేసుతో తనకు సంబంధం ఏంటీ అంటూ ఒక మెయిల్ కూడా చేసాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడమే కాకుండా.. తాను ఐటీ సలహాదారు అంటూ మెయిల్ లో సమాధానం ఇచ్చాడు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి మార్చి 28, 29 తేదీల్లో సీఐడీ పోలీసులు నోటీసులు పంపారు.
Also Read : మంగళగిరి ప్రజల దశాబ్దాల కల నెరవేర్చనున్న లోకేష్
ఈ నెల 9న విచారణకు రావాలంటూ…రాజ్ కసిరెడ్డికి 5వ తేదీనే సమన్లు జారీ చేసినా.. కనీసం రియాక్ట్ కాలేదు. ఆయన బుధవారం విచారణకు వస్తారని, నోరు తెరిచి సమాధానాలు చెప్తారని అందరూ ఆశించారు. కాని ఏ ఒక్కటి ఆయన నుంచి లేదు. దీనితో ఆయన పాత్ర ఉందనే అనుమానాలకు బలం చేకూరుతోంది. ఆయన పాత్రకు సంబంధించి అధికారులు అన్ని సాక్ష్యాలను సేకరించారు అని తెలుస్తోంది.
Also Read : సొంత కార్యకర్తపై టిడిపి కఠిన చర్యలు.. ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నట్లు?
అందుకే అరెస్ట్ భయంతో ఆయన రావడం లేదని అంటున్నారు. అయితే గత ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించి.. చంద్రబాబు సహా పలువురు కీలక నేతలపై కేసులు పెట్టి వేధించిన ఓ ఐపిఎస్ ఆయనను దేశం దాటించారు అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న సదరు అధికారి.. అమరావతి దాటి వెళ్ళకూడదు అనే నిబంధనలు ఉన్నా సరే ఆయన మాత్రం హైదరాబాద్ లోనే ఉంటూ.. నేరాలు చేసిన వారిని కాపాడుతున్నారనే భావన వ్యక్తమవుతోంది.