గతేడాది జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా పాన్ ఇండియా లెవెల్ లో మంచి హిట్ కొట్టింది. సినిమాపై ముందు నెగిటివ్ ప్రచారం జరిగినా.. ఆ తర్వాత మాత్రం జనాల్లో పాజిటివ్ క్రియేట్ కావడం, మౌత్ పబ్లిసిటీ ఎక్కువగా జరగడంతో సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. ఇక ఈ సినిమా రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందా.. అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమాపై అంచనాలు భారీగా ఉండటంతో రెండో పార్ట్ విషయంలో ఎన్టీఆర్ అభిమానులు ఏ అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ చేస్తున్నారు.
Also Read : మెగా ఫాన్స్ కు రాంచరణ్ టెన్షన్
ఇక లేటెస్ట్ గా ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోందని, జూన్ లేదా జూలై నాటికి స్క్రిప్ట్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసి.. సినిమాను 2026 మొదట్లో మొదలుపెట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్టీఆర్ కూడా డేట్స్ ఆల్మోస్ట్ ఖరారు చేశాడని, 2026 సంక్రాంతికి ప్రశాంత్ నీల్… డైరెక్షన్లో వచ్చే సినిమాను రిలీజ్ చేసి, ఆ తర్వాత దేవర పార్ట్ 2 షూట్ లో పాల్గొనాలని.. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో సినిమా స్టార్ట్ చేయాలని ఎన్టీఆర్ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
Also Read : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు వరుస గిఫ్ట్ లు రెడీ…!
ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ.. ప్రభాస్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా కంప్లీట్ అయిపోయే టైం కు స్పిరిట్ సినిమా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇక స్పిరిట్ సినిమా కంప్లీట్ అయిన తర్వాత స్క్రిప్ట్ వర్క్ కు టైం ఉంటుంది. అది అయిపోయేలోపు.. దేవరా పార్ట్ 2 లను కంప్లీట్ చేయాలని.. ఎన్టీఆర్ టార్గెట్ గా పెట్టుకుని వర్క్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది. త్వరలోనే ఎన్టీఆర్ కూడా సెట్స్ లో షూటింగ్ కు హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ సినిమా వార్ సీక్వెల్ షూటింగ్ ఎన్టీఆర్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాడు.




