చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు మధ్య జరిగిన మ్యాచ్లో 17 ఏళ్ల తర్వాత చెన్నైలో బెంగళూరు విజయం సాధించింది. భారీ స్కోర్ చేయకపోయినా బౌలింగ్ కట్టుదిట్టంగా చేయడంతో బెంగళూరు ఈ మ్యాచ్లో విజయకేతనం ఎగరవేసింది. సొంత మైదానం కాబట్టి ఖచ్చితంగా చెన్నై గెలుస్తుందని అందరూ భావించారు. తీరా చూస్తే బెంగళూరు బ్యాటింగ్లో గొప్పగా రాణించకపోయినా బౌలింగ్లో మాత్రం అంచనాలకు మించి రాణించింది.
Also Read : ఐపిఎల్ లో పర్సనల్ రివేంజ్
దీనితో ఏడాది ఐపీఎల్ సీజన్లో రెండు విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది బెంగళూరు. అయితే ఇక్కడ ధోని బ్యాటింగ్ పై అభిమానులు సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ధోనిని ఆకాశానికి ఎత్తేసిన అభిమానులు ఇప్పుడు అతని ఆట తీరుపై మండిపడుతున్నారు. వాస్తవానికి టోర్నమెంట్ మ్యాచ్ లలో రన్ రేట్ అనేది అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. గెలిచే అవకాశం లేకపోయినా ఓటమి అంతరం తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈ విషయంలో చెన్నై దారుణంగా విఫలమైంది అనే చెప్పాలి.
Also Read : నాగబాబుకు బ్రేక్.. కారణమిదే..!
ముఖ్యంగా ధోని బ్యాటింగ్ అంచనాలకు ఏమాత్రం దగ్గరగా లేకపోవడంతో చెన్నై అభిమానులు కూడా ధోనీపై విమర్శలు చేస్తున్నారు. పరుగులు అంతరాన్ని తగ్గించకుండా ధోని డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నం చేయడంపై అభిమానులు సోషల్ మీడియాలో ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఒకవైపు జడేజా దూకుడుగాడే ప్రయత్నం చేస్తున్న ధోని మాత్రం సింగిల్స్ తీయడం లేదంటే డిఫెన్స్ ఆడేందుకు ప్రాధాన్యత ఇవ్వడం చికాకు పెట్టింది. చివరిలో ధోని బౌండరీలు కొట్టేందుకు ప్రయత్నం చేయడం కామెడీ అంశంగా మారింది. ఇక అశ్విన్, జడేజా లను ముందు పంపించి ధోని ఆ తర్వాత బ్యాటింగ్ కు రావడం పై కూడా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.