Tuesday, October 28, 2025 04:21 AM
Tuesday, October 28, 2025 04:21 AM
roots

తనకు క్రికెట్ కంటే చదువే ముఖ్యం అంటున్న స్టార్ క్రికెటర్

సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెడితే… డబ్బు సంపాదనతో చదువును అసలు పట్టించుకోరు క్రికెటర్లు. కాని ఓ స్టార్ క్రికెటర్ మాత్రం తనకు క్రికెట్ కంటే చదువే ముఖ్యం అన్నాడు. ఐపిఎల్ ద్వారా బాగా ఫేమస్ అయిన వెంకటేష్ అయ్యర్ ను మొన్న 23 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది. ఈ డైనమిక్ బ్యాట్స్మెన్ కు క్రికెట్ కంటే చదువే ముఖ్యమని ప్రకటించాడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెంకటేష్ అయ్యర్ మాట్లాడుతూ… ప్రస్తుతం తాను ఫైనాన్స్ సబ్జెక్టుతో పీహెచ్ డీ చేస్తున్నట్టు ప్రకటించాడు.

Also Read : ఆకట్టుకుంటున్న రానా దగ్గుబాటి షో.. అక్కినేని, దగ్గుబాటి కిడ్స్ సందడి

ఈసారి తనను ఇంటర్వ్యూ చేసే సమయానికి డాక్టర్ వెంకటేశ్ అయ్యర్ ను అవుతానని, క్రికెట్ ఆటగాళ్లు కేవలం క్రికెట్ నాలెడ్జ్ కే పరిమితం కాకుండా, ఇతర విషయాల్లోనూ పరిజ్ఞానం పెంచుకోవడం అవసరమని చెప్పుకొచ్చాడు ఈ యంగ్ క్రికెటర్. పీజీ వరకు, కనీసం డిగ్రీ వరకైనా క్రికెటర్లు చదువుకోవాలని తన అభిప్రాయం చెప్పాడు. మధ్యప్రదేశ్ రంజీ టీమ్ లోకి ఎవరైనా కొత్త ప్లేయర్ వస్తే… చదువుకుంటున్నావా అని తప్పకుండా అడుగుతానని అన్నాడు. జీవితాంతం క్రికెట్ ఆడుతూ ఉండలేమని, కానీ విద్య మనతో చివరి వరకు ఉంటుందని మంచి వ్యాఖ్యలు చేసాడు.

Also Read : వెయ్యి కోట్లు దోచిన పిన్నెల్లి… ఆధారాలు బయటకు

ఆటలోనే కాదు, జీవితంలోనూ మంచి నిర్ణయాలు తీసుకోవడానికి విద్య ఉపయోగపడుతుందని వెంకటేష్ చెప్పడం గమనార్హం. తాను 2018లో ఫైనాన్స్ సబ్జెక్టుతో ఎంబీయే చేశానని, ఆ తర్వాత డెలాయిట్ వంటి ప్రముఖ కంపెనీలో జాబ్ కూడా వచ్చిందని వెంకటేశ్ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అయితే, క్రికెట్ పై దృష్టి సారించడం కష్టమని జాబ్ ఆఫర్ కు నో చెప్పానని అన్నాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్