భారత క్రికెట్ లో సంజూ సామ్సన్ పై వివక్ష కొనసాగుతోందా..? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ అభిమానులు. అపార ప్రతిభ ఉన్నా సరే.. అతనికి జట్టులో చోటు దక్కడం మాత్రం కష్టంగా మారుతోంది. ఏళ్ళ తరబడి.. డగౌట్ కే పరిమితమైన సామ్సన్.. నిలకడగా రాణిస్తున్నా సరే, అవకాశాలు మాత్రం కష్టంగా మారుతున్నాయి. ఇటీవల ఆసియా కప్ లో అతనికి చోటు దక్కినా సరే.. గిల్ కోసం అతని బ్యాటింగ్ ఆర్డర్ ను 5 వ స్థానానికి మార్చారు. కాని ఇదే సమయంలో గిల్ మాత్రం రాణించలేదు.
Also Read : స్పిరిట్ విలన్ అతనే.. సందీప్ రెడ్డి సేఫ్ సెలెక్షన్
కొన్ని సందర్భాల్లో బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. దీనిపై క్రికెట్ అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకు గానూ.. జట్టును ఎంపిక చేయగా.. సామ్సన్ ను కేవలం టి20 లకే పరిమితం చేసారు. కానీ టెస్ట్ ఆటగాడు ధృవ్ జూరెల్ ను మాత్రం వన్డే జట్టుకు ఎంపిక చేయడం ఆశ్చర్యం కలిగించింది. జూరెల్ తో పోలిస్తే, సామ్సన్ వైట్ బాల్ క్రికెట్ లో నిలకడగా రాణించిన సందర్భాలు ఉన్నాయి. కానీ సామ్సన్ కు మాత్రం చోటు కల్పించలేదు సెలెక్షన్ కమిటీ.
Also Read : కూటమి.. నిజంగానే ఇది మంచి ప్రభుత్వం..!
అటు టెస్ట్ క్రికెట్ ఆడే సామర్ధ్యం ఉన్నా సరే సామ్సన్ కు మాత్రం అవకాశాలు రావడం కష్టంగా మారింది. దీనిపై మాజీ క్రికెటర్ లు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై ఎందుకీ వివక్ష అంటూ.. సెలెక్షన్ కమిటీని తప్పుబడుతున్నారు. ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ.. సామ్సన్ కు అన్యాయం చేసారని, ఇప్పుడు కూడా అదే కొనసాగుతోంది. ఇక చోటు కల్పించినా సరే, తుది జట్టులో మాత్రం చోటు కల్పించలేదని మండిపడుతున్నారు.