Tuesday, October 28, 2025 06:58 AM
Tuesday, October 28, 2025 06:58 AM
roots

పవన్ ఫ్యాన్స్ కు మరో క్రేజీ న్యూస్

జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాలపై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు సినిమాల్లో నటిస్తుండగా ఒక సినిమా జూన్లో రిలీజ్ కానుంది. ఎప్పటినుంచో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ గురించి సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ చర్చించుకుంటూనే ఉన్నారు. అటు టాలీవుడ్ లో సైతం దీని గురించి ఆసక్తికర చర్చలే జరుగుతున్నాయి. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగును కంప్లీట్ చేశారు.

Also Read : టిబెటన్ పీఠభూమిపై విమానాలు ఎందుకు ఎగరలేవు?

అనారోగ్య కారణాలతో కొన్ని రోజులు పాటు సినిమా షూటింగ్ కు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేయడంతో సినిమా యూనిట్ ఎడిటింగ్ పనులపై పడింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేస్తుంది సినిమా యూనిట్. ఇదిలా ఉంచితే మరో రెండు సినిమాలు కూడా పవన్ కళ్యాణ్ లైన్లో పెట్టారు. సుజిత్ డైరెక్షన్లో ఒక సినిమా హరీష్ శంకర్ డైరెక్షన్లో మరో సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనున్నాయి. ఈ సినిమాల షూటింగు కూడా త్వరగా కంప్లీట్ చేయాలని పవన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాల తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని కూడా పవన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Also Read : కేసీఆర్ చేస్తే రైట్.. మరి రేవంత్ చేస్తే..!

పలు రాష్ట్రాల ఎన్నికలు ఉండటం ముఖ్యంగా తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికలపై దృష్టి పెట్టాల్సి ఉంది. అలాగే తెలంగాణలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు. దానికి తోడు బిజెపి అధినాయకత్వం కూడా పవన్ కళ్యాణ్ పై చాలా ఆశలు పెట్టుకుంది. వీటిని దృష్టిలో పెట్టుకున్న పవన్.. ఇప్పటివరకు సైన్ చేసిన సినిమాలు ఆలస్యమైతే నిర్మాతలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి వాటిని వేగంగా కంప్లీట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారట.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్