మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై సీపీఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు జగన్ తీరు ఎలా ఉందో తెలుసా అంటూ సెటైర్లు వేశారు. మరి చిన్న పిల్లాడి మాదిరిగా ప్రత్యేక హోదా కోసం మారాం చేయడం ఏమిటని సెటైర్లు వేశారు నారాయణ. ఏపీ రాజకీయాల్లో మాటల తూటాలు పేల్చే నాయకుల్లో నారాయణ ఒకరు. ఏ విషయం అయినా సరే కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. వామపక్షాల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తున్న నారాయణ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కూడా పలు సందర్భాల్లో నిలదీస్తున్నారు. ప్రభుత్వాలు తీసుకున్న విధానాల్లో లోపాలను ఎత్తి చూపుతారనే పేరు నారాయణకు ఉంది.
Also Read : పవన్ ఫ్యాన్స్ కు మళ్ళీ షాక్ తప్పదా…?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీరును సీపీఐ నారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. అసలు తనకు ఏం కావాలో జగన్‌కు తెలుసా అంటూ నిలదీశారు. ఎమ్మెల్యే పదవికి జగన్ అనర్హుడు అంటూ వ్యాఖ్యాలు చేశారు. ఎమ్మెల్యే పదవికి జగన్ వెంటనే రాజీనామా చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. ఓట్లేసి గెలిపించిన పులివెందుల ప్రజలకు అందుబాటులో జగన్ లేడని విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టని జగన్‌కు పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు సీపీఐ నారాయణ. మొత్తం 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు సీపీఐ నారాయణ. జగన్‌ను జనం తిరస్కరించారని… ఈ విషయం వైసీపీ నేతలు గుర్తించాలన్నారు. ప్రజా సమస్యలపై సభలో మాట్లాడాలంటే ప్రతిపక్ష హోదా ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఒకరిద్దరు ఉన్నా కూడా వామపక్ష నేతలు చట్టసభల్లో తమ స్వరం వినిపిస్తున్నారని గుర్తు చేశారు.
Also Read : పార్టీ క్యాడర్ ను ముంచుతున్న ఎమ్మెల్యే…?
చిన్న పిల్లలు చాక్లెట్ కోసం మారాం చేసినట్లుగా ప్రతిపక్ష ఇవ్వాలంటూ జగన్ అడుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా అనేది ఇస్తే వచ్చేది కాదని… రాజ్యాంగబద్ధంగా వస్తుందన్నారు నారాయణ. ఏ పార్టీని గెలిపించాలో ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. కూటమి సర్కార్‌పై కూడా నారాయణ విమర్శలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో భారీ ఎత్తున అవినీతి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వారిని వదిలేసి… నోటి దురుసుతో మాట్లాడిన వారిని మాత్రమే అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. వేల కోట్ల ప్రజాధనాన్ని దోచేసిన వారంతా ఇప్పటికీ బయటే తిరుగుతున్నారని నారాయణ గుర్తు చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవద్దన్నారు. ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని.. ప్రజాధనం రికవరీ చేయాలని డిమాంచే చేశారు సీపీఐ నారాయణ.




