Saturday, September 13, 2025 01:21 AM
Saturday, September 13, 2025 01:21 AM
roots

పొంగులేటి వ్యాఖ్యల వెనుక ఇంత కుట్ర ఉందా…?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చంద్రబాబు ప్రకటించిన నాటి నుంచి ప్రతిపక్షాలు దాడి చేస్తూనే ఉన్నాయి. వైసీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇందుకు ప్రధానంగా ఒకటే కారణం రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి అయితే… ప్రపంచంలోనే టాప్ 5 నగరాల్లో ఒకటిగా నిలుస్తుందన్న చంద్రబాబు మాట. అదే జరిగితే… తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి తిరుగుండదు.. అదే సమయంలో పొరుగు రాష్ట్రాలు పూర్తిగా వెనుకబాటుకు గురవుతాయనేది అక్షర సత్యం. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా… సమయం సందర్భం లేకపోయినా సరే.. అమరావతిపై విషం కక్కేందుకు విపక్ష నేతలు రెడీ అవుతున్నారు.

అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా ఒప్పుకున్న జగన్… ఆ తర్వాత నుంచి ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించాడు. ఎన్నికలప్పుడు కూడా అమరావతి రాజధాని అని ఒప్పుకున్న జగన్… తర్వాత మాత్రం… ఏరు దాటిన తర్వాత తెప్ప తగలెట్టినట్లుగా మూడు రాజధానుల ప్రస్తావన తీసుకువచ్చారు. అంతే… 2024 ఎన్నికల్లో ప్రజలు మళ్లీ అమరావతికే జై కొట్టడంతో వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇక అమరావతి శంకుస్థాపనకు వచ్చిన నాటి తెలంగాణ సీఎం కేసీఆర్… ఆ డిజైన్లు చూసిన తర్వాత కన్నుకుట్టినట్లుంది. అంతే.. 2019 ఎన్నికల్లో నాటి వైసీపీ నేతలతో లోపాయకారి ఒప్పందం చేసుకుని అమరావతిపైన, ఏపీ పైన తప్పుడు ప్రచారం చేశారు. ఏపీలో 2014లో టీడీపీ గెలిచిన తర్వాత తెలంగాణలో అన్ని రంగాల అభివృద్ధి భారీగా పడిపోయినందుకే ఈ తరహా కుట్ర చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అప్పట్లోనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీ గెలిచిన తర్వాత హైదరాబాద్ మళ్లీ పుంజుకుంది అనేది వాస్తవం.

Also Read : స్టైల్ మార్చిన సీఎం చంద్రబాబు..!

ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులపైన సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. 2027 జూన్ 30 నాటికి తొలిదశ పనులు పూర్తి కావాలని అధికారులకు టార్గెట్ పెట్టారు. ఈ దిశగానే నిధులను కేటాయిస్తున్నారు కూడా. దీంతో పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. దీంతో ఈ ప్రభావం క్రమంగా పొరుగు రాష్ట్రాలపై పడింది. దీంతో అమరావతిపై మళ్లీ తెలంగాణ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. వరదల వల్ల అమరావతికి పెట్టుబడులు రావడం లేదన్నారు. అందుకే బడా కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు పరుగులు పెడుతున్నాయన్నారు పొంగులేటి.

కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలపై కూటమి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతి అభివృద్ధి చెందుతోందని… పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయన్నారు. పొంగులేటి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర… వైసీపీ నేతల మాటలే పొంగులేటి చెబుతున్నారన్నారు. జగన్‌తో ఉన్న మితృత్వం వాసనలు ఇంకా పోలేదా అంటూ సెటైర్ వేశారు. గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు పొంగులేటికి భారీ ప్రాజెక్టులు కట్టబెట్టారు. అలాగే 2014 ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి వైసీపీ ఎంపీగా పొంగులేటి గెలిచారు కూడా. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ… జగన్‌తోనే నడుస్తున్నట్లు పొంగులేటి భావిస్తున్నాడా అని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అందుకే జగన్ చెప్పినట్లుగా అమరావతిపై పొంగులేటి విమర్శలు చేస్తున్నారన్నారు. అమరావతి మునిగిపోతుందంటూ తప్పుడు ఆరోపణలు చేసిన పొంగులేటిపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్