Monday, October 27, 2025 10:40 PM
Monday, October 27, 2025 10:40 PM
roots

రేవంత్ మాటకు విలువ లేదా…?

తెలంగాణ కాంగ్రెస్ లో కొంతమంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు సిద్ధమయ్యారా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. తాజాగా అల్లు అర్జున్ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరిని మాట్లాడవద్దని ఆదేశించారు. ఈ విషయంలో పిసిసి అధ్యక్షుడికి కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు వెళ్ళాయి. అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర నాయకత్వానికి కొన్ని సూచనలు సలహాలు చేసినట్లుగా కూడా ప్రచారం జరిగింది. సినిమా వాళ్ళతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి.

Also Read : తప్పంతా వాళ్ళదే.. విచారణలో మౌనంగా అల్లు అర్జున్

అయినా సరే ఇప్పుడు కొంతమంది నాయకులు పదేపదే అల్లు అర్జున్ లక్ష్యంగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. తాజాగా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారు. అల్లు ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కాస్త ఘాటుగానే విమర్శలు చేశారు. అలాగే పుష్ప సినిమాను కూడా ఆయన టార్గెట్ చేయడమే కాకుండా పగటివేషగాళ్లంటూ మాట్లాడారు. ఇటువంటి వ్యాఖ్యలు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగానే ఉంటాయి. సినిమా వాళ్ళతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

Also Read : టార్గెట్ కేటీఆర్ అంటున్న బన్నీ ఆర్మీ..!

ప్రస్తుతం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరి పై ప్రజల్లో కొంత వరకు ఎటువంటి వ్యతిరేకత రావటం లేదు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీని సమర్థించే వాళ్ళు కూడా ఈ విషయంపై రేవంత్ రెడ్డిని పొగిడే పరిస్థితి ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంటే మంచిది అనే విషయం అర్థం అవుతుంది. కానీ కొంతమంది కాంగ్రెస్ నేతలు మాత్రం అధిష్టానంతో అలాగే రాష్ట్ర నాయకత్వంతో సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు అనే సంకేతాలు కూడా వస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినా లెక్క చేయకపోవడం పట్ల పిసిసి సీరియస్ గా ఉన్నట్టు కనపడుతోంది. అవసరమైన సమయంలో విమర్శలు చేయకుండా అనవసరమైన సమయంలో వద్దని ఆదేశించిన సమయంలో మాట్లాడటం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్