Tuesday, October 28, 2025 07:02 AM
Tuesday, October 28, 2025 07:02 AM
roots

బీజేపీని ఆడేసుకుంటున్న కాంగ్రెస్.. సెల్ఫ్ డిఫెన్స్ లో ఫెయిల్..?

భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ విషయంలో కఠినంగా ముందుకు వెళుతుందని అందరూ భావించారు. ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ నిర్వహించి పెద్ద ఎత్తున.. పాకిస్తాన్ లో దాడులకు దిగింది భారత ఆర్మీ. ఇక ఆ తర్వాత పాకిస్తాన్ కూడా ప్రతిఘటించే విషయంలో దూకుడుగానే వ్యవహరించింది. పలు దేశాల నుంచి పాకిస్తాన్ కు మద్దతు లభించడంతో.. పాక్ ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్ళింది.

Also Read :ప్రభుత్వం కూలుతుందా..? సైలెంట్‌గా కాంగ్రెస్..?

ఈ సమయంలో అమెరికా జోక్యం చేసుకోవడం.. కాల్పుల విరమణ ఒప్పందానికి రెండు దేశాలను ఒప్పించడం వంటివి జరిగాయి. ఇక్కడ వరకు బాగానే ఉంది గాని.. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటుగా ఎన్డీఏ సర్కార్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. పాకిస్తాన్ విషయంలో అమెరికా ఏవిధంగా జోక్యం చేసుకుంటుంది అంటూ.. చాలామంది మండిపడ్డారు. ఇక ఇప్పుడు ఈ విషయంలో బిజెపి తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. దేశభక్తి విషయంలో రెండు అడుగుల ముందుకు వేసే బిజెపి కార్యకర్తలు.. సోషల్ మీడియాలో ఆత్మ రక్షణలో పడిపోయారు.

Also Read :ఎందుకీ మౌనం.. సైలెంట్ అయిపోయిన వైసీపీ సోషల్ మీడియా

జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా టార్గెట్ చేసిన బిజెపి కార్యకర్తలు, ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ దూకుడుగా విమర్శలు చేస్తున్నా సరే బిజెపి కార్యకర్తల నుంచి కౌంటర్ ఉండడం లేదు. దానికి తోడు జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి నిందితులను పట్టుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది అనే ఆరోపణలు సైతం వస్తున్నాయి.

Also Read :అదే నిజమైతే.. 16 నెలల సంగతి ఏంటీ..?

దాడి చేసిన ఆరుగురు ఉగ్రవాదుల గురించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. గతంలో ముంబై ఉగ్రదాడుల సమయంలో.. నిందితులను కాంగ్రెస్ పార్టీ సర్కార్ అరెస్టు చేసిందని.. ఇన్ని దాడులు జరిగి సైనికులు చనిపోతున్నా .. నిందితులను ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారంటూ కాంగ్రెస్ తీవ్ర విమర్శలకు దిగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద రచ్చ జరుగుతున్నా.. బిజెపి సోషల్ మీడియా మాత్రం దేశభక్తిపై హడావుడి చేయడం మినహా కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్