Monday, September 15, 2025 03:10 PM
Monday, September 15, 2025 03:10 PM
roots

సజ్జల ప్రకటనతో వైసీపీలో గందరగోళం..!

వైసీపీ అధికారంలోకి వస్తే.. అమరావతి రాజధాని అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా ప్రకటించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వ్యవహరించారు సజ్జల. ఆ ఐదేళ్ల పాటు ఆయనను అంతా సకల శాఖా మంత్రి అని ముద్దుగా పిలుచుకున్నారు కూడా. చివరికి వైసీపీ అనుకూల మీడియాకు చెందిన ఇద్దరు మహిళా రిపోర్టర్లు క్యాంపు కార్యాలయంలోనే తన్నుకుంటూ.. పదా ఎస్ఆర్‌కే దగ్గరే తేల్చుకుందామన్నారు. అంతటి పవర్ ఫుల్ లీడర్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు వైసీపీ నేతల్లో పెద్ద దుమారం రేపుతోంది.

Also Read :చంద్రబాబు అలా ఎందుకన్నారు..?

అసెంబ్లీలో రాజధాని ఎంపికపై చర్చ జరుగుతున్న సమయంలో కనీసం 30 వేల ఎకరాలు కావాలని ప్రతిపక్ష నేత హోదాలో జగన్ డిమాండ్ చేశారు. అలాగే రాజధానిగా దొనకొండ లేదా నూజివీడు ప్రాంతాలను ఎంపిక చేయాలని కూడా అసెంబ్లీలో గట్టిగానే ప్రశ్నించారు జగన్. ఇక 2019 ఎన్నికల సమయంలో రాజధానిని మారుస్తారంటూ టీడీపీ నేతలు చేసిన ప్రచారానికి జగన్ స్వయంగా బ్రేక్ వేశారు. తన ఇల్లు తాడేపల్లిలో రాజధాని పరిధిలోనే ఉందని.. చంద్రబాబు అద్దె ఇంట్లో ఉంటున్నారని ఎద్దేవా చేశారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత వికేంద్రీకరణ అంటూ కొత్త పాట పాడిన జగన్.. 3 రాజధానుల ప్రతిపాదన చేశారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో.. చివరికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు.

ఇప్పుడు మళ్లీ రాజధానిగా అమరావతికి కట్టుబడి ఉన్నామని.. రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తామని.. విజయవాడ, గుంటూరు నగరాలను కూడా అభివృద్ధి చేస్తామని సజ్జల వెల్లడించారు. వాస్తవానికి వైసీపీలో ఏ నిర్ణయం అయినా సరే.. అది జగన్ మాత్రమే తీసుకోవాలి. అంటే సజ్జల చేసిన ప్రకటన జగన్ చెప్పిందే అని అంతా భావిస్తున్నారు. ఈ ప్రకటన ఇప్పుడు వైసీపీ నేతలను డైలమాలో పడేస్తోంది. ఇప్పటి వరకు రాజధాని అమరావతిపై వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు.

Also Read : నేపాల్ ఉద్యమం.. నష్టం ఎవరికీ..?

స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం అయితే స్మశానంతో పోల్చారు. మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ అయితే.. ఇక్కడ మనుషులు ఉంటారా..? అని వ్యాఖ్యానించారు. ఇక వైసీపీ నేతలు, సోషల్ మీడియా అభిమానులు అయితే ఇప్పటికీ అమరావతిపై విషం చల్లుతూ ఉన్నారు. కమ్మరావతి, అలల రాజధాని, ఏపీ వెనిస్, ముంపు ప్రాంతం, ఎత్తిపోతల పథకాలు, చేపలు బాగా దొరుకుతాయి, రాజధానిలోనే పులస చేపలు.. అంటూ నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. ఏ నోటితో అయితే రాజధాని అమరావతిపై విమర్శలు చేశారో.. ఇప్పుడు అదే నోటితో రాజధానిని అభివృద్ధి చేస్తామని చెప్పాల్సిన పరిస్థితిని అధినేత జగన్ కల్పించారని వాపోతున్నారు. మాట తప్పడు.. మడమ తిప్పడు.. అని గొప్పగా ఇప్పటి వరకు చెప్పుకున్నామని.. కానీ రాజధాని విషయంలో మాత్రం.. ఇన్ని మాటలు మార్చాడేంటి అనేది మరికొందరి మాట. మొత్తానికి సజ్జల ప్రకటన వైసీపీలో గందరగోళానికి కారణమైంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

సజ్జలను లైట్ తీసుకోండి.....

గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ...

భోగాపురంలో ఫస్ట్ విమానం...

ఏపీని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి...

వైసీపీ నేతలకు ఆ...

ఏపీలో మెడికల్ కాలేజీల రగడ తారాస్థాయికి...

చంద్రబాబు అలా ఎందుకన్నారు..?

ముఖ్యమంత్రి చంద్రబాబు చేసే వ్యాఖ్యలు చాలా...

టార్గెట్ పంచాయితీ.. 14...

ఆంధ్రప్రదేశ్ లో ఆల్ ఇండియా సర్వీస్...

రేవంత్, కేటీఆర్ కు...

సాధారణంగా రాజకీయాల్లో వచ్చిన అవకాశాలను వాడుకోవడానికి...

పోల్స్