Friday, September 12, 2025 01:46 PM
Friday, September 12, 2025 01:46 PM
roots

భారతక్క దగ్గర కూడా గందరగోళమే..!

వైసీపీలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఎవరుంటారో.. ఎవరు పోతారో కూడా తెలియని పరిస్థితి. అసలు వైసీపీ ఉంటుందో.. పోతుందో కూడా అర్థం కావటం లేదంటున్నారు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం జగన్ నియంతృత్వ వైఖరి అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నేతలను, కార్యకర్తలను కనీసం పట్టించుకోలేదు. ఎంత వరకు సోషల్ మీడియా, ప్రత్యర్థులపై కేసులు, దాడులు. అదే సమయంలో పార్టీలో ఒకరిద్దరు నేతల మాటలకే జగన్ విలువిచ్చాడు. అంతే తప్ప మరో నేతను దగ్గరకు రానివ్వలేదు. దీంతో ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. అయినా సరే జగన్ తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ ప్యాలెస్‌కే పరిమితం అయ్యాడు.

Also Read: విజయసాయి ఫ్యూచర్ ప్లాన్ ఇదే..!

కూటమి ప్రభుత్వం కూలిపోతుందని.. తాను తిరిగి అధికారంలోకి వస్తానంటూ ఇప్పటి నుంచి పార్టీ నేతలకు చెబుతున్నాడు జగన్. పార్టీ నుంచి రోజుకో నేత వెళ్లిపోతున్నాడు. చివరికి అత్యంత ఆప్తుడు, జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 విజయసాయిరెడ్డి కూడా జగన్‌కు గుడ్ బై చెప్పేసి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్ సొంత పత్రిక సాక్షిలో కూడా గందరగోళం ఏర్పడింది. ఇప్పటికే కీలక వ్యక్తులు ఒక్కొక్కరుగా సంస్థకు దూరమవుతున్నారు. తాజాగా వైఎస్ భారతి బంధువు, సాక్షి టీవీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణి రెడ్డి కూడా సాక్షికి దూరమైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి సాక్షి సంస్థలో రాణి రెడ్డి చాలా కీలక పదవి నిర్వహిస్తున్నారు. ఆమె భారతికి ఎంత చెబితే అంత అనేది అందరికీ తెలిసిన విషయమే.

Also Read: పోర్ట్ వాటాల కక్కుర్తి ముంచేసిందా..? కెవి రావు ఇచ్చిన సాక్ష్యాలు ఏంటీ..?

భారతికి బంధువుతో పాటు ఫ్రెండ్ కూడా. చాలా ఏళ్లుగా సాక్షిలో అజమాయిషీ చేస్తున్నారు రాణి రెడ్డి. టీవీకే కాకుండా పత్రికలో కూడా ఆమె చాలా కీలకం. అయితే హఠాత్తుగా రాణి రెడ్డిని తొలగించాలని భారతి నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలల నోటీసు కూడా ఇచ్చారు. అయితే నోటీసు సమయంలో ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదని… సంస్థ వ్యవహారాల్లో ఎక్కడా జోక్యం చేసుకోవద్దని కూడా నోటీసులో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో రాణి రెడ్డి కూడా ఆఫీసుకు రావడం మానేసినట్లు సమాచారం. ఇదంతా ఎన్టీఆర్ వర్థంతిరోజు సందర్భంగా పత్రికలో వచ్చిన ఫుల్ పేజ్ యాడ్ కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Also Read: గవర్నర్ ఫోన్ ట్యాపింగ్.. కీలక సాక్ష్యాలు లభ్యం..!

కోటి సభ్యత్వాలు పూర్తి, ఎన్టీఆర్ వర్థంతిని పురస్కరించుకుని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు సాక్షి పత్రికలో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారు. ఇది దాదాపు రూ.50 లక్షల వరకు ఉంటుంది. అయితే ఈ యాడ్ వల్ల వైసీపీలో పెద్ద దుమారం రేగింది. పార్టీ నేతల మనోభావాలకంటే జగన్‌కు, భారతికి డబ్బే ముఖ్యమని.. అందుకే సొంత పత్రికలో ఫుల్ పేజి యాడ్ వేశారని విమర్శిస్తున్నారు. ఇక ఈ ప్రకటన వచ్చిన వెంటనే పార్టీ అధికార ప్రతినిధి కాపు రామచంద్రారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ యాడ్ పత్రికలో రావడానికి కారణమైన రాణి రెడ్డిని తొలగించాలని ఇప్పటికే పలువురు వైసీపీ ముఖ్యనేతలు కూడా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే రాణి రెడ్డిని సాక్షి గ్రూప్ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. దీని వల్ల పార్టీలో గందరగోళానికి చెక్ పడుతుందని భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్