Friday, September 12, 2025 07:29 PM
Friday, September 12, 2025 07:29 PM
roots

అధ్యక్ష పదవి కోసం ఆ ఇద్దరి మధ్య పోటీ..!

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా పోటీ నడుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరి గత ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. నాటి నుంచి ఆమె జాతీయ రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. అదే సమయంలో బీజేపీ అధ్యక్షురాలిగా పురేంధేశ్వరి బాధ్యతలు చేపట్టి ఇప్పటికే ఏడాది దాటిపోయింది. ఈ నేపథ్యంలో ఆమెను మారుస్తారనే మాట కమలం పార్టీలో బలంగా వినిపిస్తోంది. దీంతో అధ్యక్ష స్థానం కోసం అవకాశం ఉన్న నేతలు ఎవరి ప్రయత్నం వాళ్లు తీవ్రంగా చేస్తున్నారు.

Also Read : రెడ్ బుక్ లో పేరున్నా.. కీలక పోస్టింగ్! సీఐ గారి హవా..!

బీజేపీలో ఒకే నేతకు రెండు పదవులివ్వడంపై తొలి నుంచి అవకాశం లేదు. ఒకరిద్దరు జాతీయస్థాయి నేతలు తప్ప… మిగిలిన ఎవరికీ కూడా అలా రెండు పదవులు నిర్వహించే అవకాశం రాలేదు. దీంతో ప్రస్తుతం ఏపీలో పార్టీ పగ్గాలను కూడా పురంధేశ్వరి నుంచి తప్పించి… మరొకరికి అప్పగించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో ఏపీలో పలువురు కీలక నేతలంతా ఇప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. గతంలో పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన సోము వీర్రాజు ప్రయత్నం చేసినప్పటికీ… అవకాశం లేదని ఢిల్లీ పెద్దలు తేల్చి చెప్పేశారు.

Also Read : చిరంజీవి కి రాజ్యసభ ఆఫర్.. ఢిల్లీలో డీల్ ఫైనల్

అధ్యక్ష స్థానం కోసం ప్రముఖంగా నలుగురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ తరఫున ఉత్తరాంధ్ర 3 జిల్లాల ఎమ్మెల్సీగా వ్యవహరించిన వంశీ నాగేంద్ర మాధవ్‌తో పాటు మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు, విష్ణు వర్థన్ రెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి పేరు వినిపిస్తున్నప్పటికీ… ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయనకు అవకాశం లేదనే మాట వినిపిస్తోంది. అయితే జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్థన్ రెడ్డిలపై పార్టీలో ఓ వర్గం నేతలు తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని… జగన్‌కు అనుకూలంగా టీడీపీని ఇరుకున పెట్టేలా విమర్శలు చేశారని టీడీపీ, జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలు అడ్డుకోవడం వల్లే గత ఎన్నికల్లో జీవీఎల్, విష్ణు వర్థన్ రెడ్డిలకు టీకెట్లు రాలేదనేది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో వంశీ నాగేంద్ర మాధవ్ పేరు దాదాపు ఖరారైనట్లే తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్